వర్మ కుక్కతో పోల్చుతూ.. టాలీవుడ్ హీరో ట్వీట్
ఈ మధ్య కాలంలో వివాదాస్పద దర్శకుడు వర్మ చేస్తున్న ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు. బయోపిక్‌లో అంటే కాసేపు.. అడల్ట్ మూవీలు , పోర్న్ స్టార్‌లతో సినిమాలు అంటూ చాలా రచ్చ చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్‌ను అతని ఫ్యాన్స్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వర్మ చేస్తున్న హడావుడి మామూలుగా లేదు. పవర్ స్టార్ అంటూ వర్మ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ' పవర్ స్టార్' పేరుతో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాతి కథ అంటూ సినిమాను ప్రకటించాడు. 'గడ్డి తింటావా' అంటూ ఓ పాటను కూడా విడుదల చేశారు. ఇది అతని అభిమానులకే కాదు టాలీవుడ్ సెలబ్రెటీలకు చిరాకు తెప్పించింది. దీంతో ఆయనపై ఒక్కొక్కరుగా మండిపడుతున్నారు. అయితే వర్మ చేస్తున్న ఈ రచ్చపై అసలు పట్టించుకోలేదు. తాజాగా ఓ టాలీవుడ్ హీరోమాత్రం.. వర్మను కుక్కతో పోల్చుతూ మండిపడ్డాడు. టాలీవుడ్ హీరో నిఖిల్.. . వర్మను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశాడు. ''శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా. ఆ మహా శిఖరం తల తిప్పి చూడదు. మీకు అర్థం అయిందిగా' అంటూ ట్వీట్ పెట్టారు. దీనికి 'పవర్ స్టార్', 'పవన్ కల్యాణ్' అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించాడు. ఇది వైరల్ కావడంతో ఆర్జీవికి గట్టి కౌంటర్ పడిందని పవన్ అభిమానులు సంబరపడుతున్నారు. Read More: పవన్ కళ్యాణ్‌కు మామూలు ఫ్యాన్సే కాదు. సెలబ్రిటీల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నితిన్, నిఖిల్.. ఇలా చాలామంది యంగ్ హీరోలంతా పవన్‌ను ఆరాధిస్తుంటారు. ఆయనపై ఎవరైనా సెటైర్ వేస్తేనే అంత ఎత్తున లేచి విమర్శలు చేస్తారు. అలాంటిది ఆర్జీవి తీస్తున్న 'పవర్ స్టార్' సినిమాపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పుడు హీరో నిఖిల్ ఏకంగా రాంగోపాల్ వర్మను కుక్కతో పోల్చడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరి దీనిపై వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి.
By July 22, 2020 at 10:10AM
No comments