రైతును లారీతో తొక్కించి హత్య.. తెలంగాణలో ఇసుక మాఫియా బరితెగింపు
జిల్లాలో రెచ్చిపోయింది. తమ పొలాల నుంచి ఇసుక తరలించొద్దంటూ అడ్డుపడిన రైతును లారీతో తొక్కించి దారుణంగా చంపేసింది. రాజాపూర్ మండలం తీర్మాలపూర్ గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో నుంచి ఇసుక అక్రమ రవాణా చేసేందుకు కొందరు వ్యక్తులు మంగళవారం రాత్రి ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన గుర్రం కాడి నరసింహులు(38) అనే రైతు వారిని అడ్డుకున్నాడు. Also Read: తన వ్యవసాయ పొలం నుంచి ఇసుక అక్రమ రవాణా చేయవద్దని, దీనివల్ల మూడు సంవత్సరాలుగా బోర్లన్నీ ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. లారీలను వెళ్లనిచ్చేది లేదంటూ అతడు అడ్డుకోవడంతో కిరాతకులు అతడి పైనుంచి లారీని ఎక్కించి వెళ్లిపోయారు. తీవ్రగాయాలతో నరసింహులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు అక్కడికి చేరుకుని లారీ అద్దాలు ధ్వంసం చేశారు. Also Read: దీంతో ఇసుక మాఫియా ప్రతినిధులు స్థానిక ప్రజాప్రతినిధిని ఆశ్రయించారు. ఆయన సమక్షంలో ఇరువర్గాల మధ్య రాజీకి ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. మరోవైపు ఇసుక మాఫియా ఆగడాలపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇసుక మాఫియా కారణంగా అనేక మంది రైతులు రోడ్డుప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. Also Read:
By July 30, 2020 at 10:35AM
No comments