విశాఖ ఏజెన్సీలో కలకలం.. యువకుడి దారుణ హత్య
విశాఖను అటు కరోనాతో పాటు.. ఇటు నేరాలు కూడా వణికిస్తున్నాయి. ఓ వైపు కరోనా కేసులు పెరుగుతుంటే.. మరోవైపు నేరాలు సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. హత్యలు, గ్యాంగ్ వార్లు, విశాఖలో సర్వసాధారణంగా మారాయి. తాజాగా విశాఖ ఏజెన్సీలో యువకుడు హత్య కలకలం రేపుతోంది. 21 ఏళ్ల యువకుడ్ని గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా హతమార్చారు. ఈ ఘటన పెడబయలు మంగలం గంపరాయి మలుపు వల్లంగి వద్ద చోటు చేసుకుంది. Read More: ఆదివారం ఉదయం ఏజెన్సీ ప్రాంతంలో ఓ యువకుడ్ని కొందరు గుర్తు తెలియని దుండుగులు దారుణంగా హత్య చేశారు. హత్యకు గురైన వ్యక్తి రామకృష్ణగా స్థానికులు గుర్తించారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్థానికులతో పాటు.. మృతుడి బంధువుల్ని కూడా విచారిస్తున్నారు. యువకుడికి ఎవరితో అయినా విభేదాలు ఉన్నాయా ? ప్రేమ వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
By July 19, 2020 at 09:41AM
No comments