Breaking News

ఆఫీసులోనే మహిళపై అత్యాచారయత్నం, హత్య.. హైదరాబాద్‌లో ఘోరం


హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. జనప్రియ కాలనీలోని ఫ్యామిలీ కేర్ సర్వీస్ సెంటర్‌లో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హేమలత అనే మహిళ ఫ్యామిలీ కేర్ సర్వీస్‌ సెంటర్‌లో పనిచేస్తోంది. సహ ఉద్యోగి వెంకటేశ్వరరావు ఆమెను కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. శుక్రవారం పని ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో హేమలత అర్ధరాత్రి వరకు ఆఫీసులో ఉండిపోయింది. దీన్ని అవకాశంగా తీసుకున్న వెంకటేశ్వరరావు ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. Also Read: అప్రమత్తమైన హేమలత అతడిని తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆవేశానికి గురైన అతడు కత్తితో ఆమె గొంతు కోసి చంపేశాడు. దీనిపై సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు హేమలత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆమె తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి శనివారం నిందితుడు వెంకటేశ్వరరావును అరెస్ట్ చేశారు. Also Read:


By July 19, 2020 at 09:51AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-murdered-by-colleague-in-lb-nagar-hyderabad-over-refused-rape-attempt/articleshow/77046444.cms

No comments