Breaking News

షాకింగ్: స్టార్ ఇంట్లో బాంబు కలకలం.. ఎంటరైన పోలీసులు! ఏం జరిగిందంటే..


తమిళ స్టార్ హీరో ఉందంటూ బెదిరింపు కాల్ రావడం సినీ వర్గాలను మరోసారి భయాందోళనలకు గురిచేసింది. శనివారం (జులై 18) సాయంత్రం చెన్నై కంట్రోల్‌ రూముకు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. చెన్నై ఈంజంపాక్కంలో ఉన్న అజిత్‌ ఇంటిలో బాబు పెట్టినట్లు ఈ ఫోన్‌ కాల్‌లో మాట్లాడిన వ్యక్తి చెప్పాడు. దీంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. అజిత్‌ ఇంటికి వెళ్లి అక్కడి పరిసరాలను అణువణువునా గాలించారు. బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్క్వాడ్‌తో ఇంటి చుట్టూరా తనిఖీలు నిర్వహించారు. అయితే అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఇది ఫేక్ కాల్ అని నిర్ధారించారు పోలీసులు. దీంతో సినీ వర్గాలతో పాటు, అజిత్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఆ ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని కనిపెట్టే పనిలోపడ్డ పోలీస్ యంత్రాంగం అతని ఆచూకీ కనుక్కున్నారు. ప్రముఖుల ఇంటికి తరచూ బాంబు బెదిరింపు చేస్తున్న విళుపురం జిల్లాకి చెందిన ఓ వ్యక్తి ఈ పని చేసినట్లు పోలీసులు తెలిపారు. బాంబు కలకలం సృష్టించిన ఆ వ్యక్తి గతంలో పలుసార్లు జైలుకు కూడా వెళ్ళొచ్చాడని, ప్రస్తుతం పరారీలో ఉన్న అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. Also Read: స్టార్ హీరోల ఇంటికి బాంబు బెదిరింపు కాల్స్ రావడం ఇది మొదటిసారి కాదు. గత నెలలో అచ్చం ఇదే తరహాలో స్టార్ హీరోలు రజినీకాంత్, విజయ్ ఇళ్లలో బాంబు ఉందని రెండు వేరువేరు సందర్భాల్లో ఫేక్ కాల్స్ వచ్చాయి. అంతకుముందు సీఎం పళనిస్వామి ఇంట్లో కూడా బాంబ్ ఉందని బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో ఇలా వరుసగా తమిళ స్టార్ హీరో ఇళ్లకే బాంబు బెదిరింపు కాల్స్ వస్తుండటం జనాల్లో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.


By July 19, 2020 at 10:04AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bomb-threat-phone-call-to-hero-ajith-kumar/articleshow/77046574.cms

No comments