క్యాస్ట్యూమ్ డిజైనర్‌కు రాశీఖన్నా వేధింపులు.. ఇలా టార్చర్ చేసేదంటూ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్ రాశీ ఖన్నాపై సంచలన ఆరోపణలు చేసింది నగ్నం హీరోయిన్, ప్రముఖ క్యాస్ట్యూమ్ డిజైనర్ . ఇటీవల వర్మ తీసిన నగ్నం చిత్రంతో నటిగా మారిన ఈ భామ.. వరుస ఇంటర్వ్యూలతో సంచలనం రేపుతోంది. తాజాగా సుప్రీమ్ సినిమా అప్పుడు ఆ మూవీ హీరోయిన్ తనను వేధించింది అంటూ నాటి విషయాలను షేర్ చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. సుప్రీమ్ సినిమాకి నేను క్యాస్ట్యూమ్ డిజైనర్‌ని. ఆ సినిమాలో హీరోయిన్ రాశీ ఖన్నా. మూడు గంటలకు నన్ను శారీ కట్టడానికి పిలిచింది. ఆ సినిమాకి రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రాఫర్. ఆయనతో నేను తమిళ్‌లో కూడా పనిచేశా. బాగా తెలుసు ఆయన. అయితే నువ్వేంటి ఇక్కడ అన్నారు.. రాశీ ఖన్నా శారీ కట్టడానికి పిలుస్తోంది.. అసిస్టెంట్లు కాకుండా నేనే శారీ కట్టాలట అని చెప్పాను. ఈ సినిమా డైరెక్టర్ అనీల్ రావిపూడి ‘పటాస్’ చిత్రానికి కూడా నేను క్యాస్ట్యూమ్ డిజైనర్‌ని. అయితే రాశీ ఖన్నా టార్చర్ పెడుతుందని ఆయనకు కూడా తెలుసు. నన్ను టార్చర్ పెట్టేది. ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు కాని.. నన్ను బాగా టార్చర్ చేసేది. ఇంటికి వెళ్లడం.. వెయిట్ చేయడం చేయించేది. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ బాగా ఎక్కువ కావడంతో నేను కూలిపనిచేసుకునే దానిలా కనిపిస్తున్నానా ఈమెకు అనుకుని.. నా చదువు ఏంటి.. చేసే పని ఏంటి.. నిఫ్ట్ కాలేజ్‌లో సీటు దొరకడమే గ్రేట్.. అలాంటిది కాలేజ్ టాపర్‌ని నేను. అలాంటిది నన్ను ఇలా చేస్తుందేంటి? అని బాధ కలిగేది. రాశీఖన్నా విషయంలో నేను చాలా సార్లు బాధ పడ్డాను. ఆ తరువాత ఆమెతో మళ్లీ పనిచేయలేదు. ఆమెతో నేను మాట్లాడే ప్రయత్నం చేయలేదు. వాళ్లు ఓ యాటిట్యూట్‌లో ఉంటారు.. నేను స్టార్‌ని నాకేంటి అనుకుంటారు. రాశీ ఖన్నా నేను వచ్చి శారీ కట్టాల్సిందే అని అంది. నేను వెళ్లి కట్టా. అదే ముంబయి అమ్మాయి అంటే వెళ్లి కడుతుందా.. నేను తెలుగు అమ్మాయిని కాబట్టి వెళ్లి కట్టా. నేను ఏదైనా ఓపెన్‌గా మాట్లాడతా.. అది రాశీ ఖన్నా కావచ్చు.. కాజల్ కావచ్చు.. ఐడోన్ట్ కేర్. వాళ్లు నిజంగా చదువు వచ్చినోళ్లా.. నిఫ్ట్ నుంచి వచ్చిన ఒక అమ్మాయిని చూపించండి. తెలుగులో ముగ్గురే ఉన్నారు.. వాళ్లలో ప్రభాస్ డిజైనర్ భాస్కర్.. పవన్ కళ్యాణ్ డిజైనర్ రాజేష్.. అండ్ శ్రీ రాపాక (నేనే). తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రొఫెషనల్ క్యాస్ట్యూమ్ డిజైనర్స్ మేం ముగ్గురమే. అయితే నాకు ఇప్పటివరకూ సినిమాలు లేకుండా అయితే లేవు. రీసెంట్‌గా దిల్ రాజు గారు ‘సీనయ్య’ సినిమాకి ఇచ్చారు. అంతకు ముందు సినిమాకి వేరేవాళ్లకి క్యాస్ట్యూమ్స్ ఇవ్వడంతో సరిగా రాలేదట. దీంతో ప్రొఫెషనల్ అయిన శ్రీని పిలవండని చెప్పారట. అంతకుముందు 40పైగా సినిమాలకు నేనే డిజైనర్ అంటూ తన గురించి తాను గొప్పగా తెగ చెప్పుకుంటోంది నగ్నం నటి శ్రీ రాపాక (స్వీటీ).
By July 03, 2020 at 01:48PM
No comments