బీజేపీ బూత్ అధ్యక్షుడి ఆత్మహత్య
పశ్చిమబెంగాల్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా రాంనగర్ కి చెందిన బీజేపీ నేత పూర్ణచంద్ర దాస్ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం రాత్రి ఆయన చెట్టుకు ఉరివేసుకొని మరణించినట్లు స్థానికులు గుర్తించారు. ఐతే ఇది ఆత్మహత్య కాదని.. రాజకీయ హత్య అని కొందరు ఆరోపిస్తున్నారు. దాస్‌ను తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరమని ఆ పార్టీ కార్యకర్తలు ఒత్తిడి తీసుకువచ్చారని చెబుతున్నారు. దీంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే బీజేపీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలని తృణమూల్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు బీజేపీ నేత ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పూర్ణచంద్ర దాస్ దిఘా పట్టణంలోని రాంనగర్2 మున్సిపాలిటీలో 41వ వార్డుకు బూత్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. ఇంతకు ముందు నార్త్ దినాజ్‌పూర్ ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ రాయ్ కూడా ఇదే తరహాలో అనుమాస్పద స్థితిలో మరణించారు. ఆయన నివాసం సమీపంలోనే మృతదేహం వేలాడుతూ కనిపించింది. Read More: ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ రే ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని బందాల్ గ్రామంలో తన నివాసానికి సమీపంలోని మార్కెట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మార్కెట్‌లోని ఆయనకు చెందిన షాపు ముందు ఉరివేసుకున్నట్లు స్థానికులు గుర్తించారు. అయితే దేవేంద్రనాథ్‌ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కుటుంబసభ్యులు, బీజేపీ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే.
By July 30, 2020 at 09:41AM
No comments