కేబుల్ వైరుతోపాటు గాల్లోకి ఎగిరిపడ్డ ఆటో డ్రైవర్.. షాకింగ్ వీడియో!
రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న కేబుల్ వైర్ ధాటికి ఓ అమాంతంగా గాల్లోకి ఎగిరాడు.. మీటర్ల దూరం అలా ఎగురుతూ వెళ్లి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళపై పడ్డాడు. దీంతో ఆటోడ్రైవర్‌తోపాటు ఆ మహిళకు కూడా గాయాలయ్యాయి. జులై 16న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. స్కూటీ నడిపే వ్యక్తి అలాగే వాహనాన్ని ముందుకు వెళ్లనీయడంతో ఒక్కసారిగా అది పైకి లేచింది. అదే సమయంలో రోడ్డు పక్కన ఆటో నిలిపిన డ్రైవర్.. వైర్‌కు అటో కాలు, ఇటో కాలు వేసి నిలబడ్డాడు. స్కూటీ ముందుకెళ్లడంతోపాటు అదే సమయంలో ఎవరైన కేబుల్‌ను లాగి ఉంటారని భావిస్తున్నారు. దీంతో ఆటో డ్రైవర్ అమాంతం గాల్లోకి ఎగిరాడు. ఆటో డ్రైవర్ గాల్లోకి ఎగిరి పడిన తీరు సినిమా స్టంట్‌ను తలపించింది. కేబుల్ రోడ్డు మీద పడి ఉన్నా సంబంధీకులు నిర్లక్ష్యం వ్యవహరించడంతో.. తమ తప్పేమీ లేకపోయినప్పటికీ. ఆ ఆటోడ్రైవర్, ఫుట్‌పాత్ మీద నడుచుకుంటూ వెళ్తున్న మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగిందని భావిస్తున్నప్పటికీ.. ఎక్కడ జరిగిందో స్పష్టం తెలియరాలేదు. Read Also:
By July 30, 2020 at 10:12AM
No comments