Breaking News

కట్నం వేధింపుల మరో మహిళ బలి.. అత్తింట్లోనే ఉరేసుకున్న వివాహిత


భర్త, అత్తింటి వేధింపులు తాళలేక శంషాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని లావణ్య లహరి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే శివారులో అలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త, అత్తమామలు, ఆడపడుచు పెట్టే చిత్రహింసలు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం హర్షగూడ పంచాయతీలో శనివారం జరిగింది. Also Read: హర్షగూడకు చెందిన రమావత్ వీరేష్ నాయక్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి కొంతకాలం క్రితం రోజా అనే యువతితో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.10లక్షల నగదు, బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చారు. అయితే కొద్దిరోజులకే రోజాకు అత్తింట్లో వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త, అత్తమామలు, ఆడపడుచు వేధించడం మొదలుపెట్టారు. మొదటి కాన్పులో బాబు పుట్టగా, రెండో కాన్పులో ఆడపిల్ల పుట్టడంతో అత్తింటి వారు కనీసం చూడటానికి కూడా రాలేదు. Also Read: ఇటీవలే రోజా బిడ్డలతో కలిసి అత్తింటికి వచ్చింది. కొద్దిరోజుల క్రితం పుట్టింటి నుంచి తెచ్చిన 10తులాల బంగారం వ్యాపారం పెట్టుబడి కోసం ఇవ్వాలని అత్తమామలు అడగ్గా రోజా నిరాకరించింది. దీంతో భర్త ఆమెను చిత్రహింసలు పెట్టాడు. ఆదివారం దంపతుల మధ్య మరోసారి గొడవ జరగడంతో రోజా మనస్తాపానికి గురైంది. గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో వీరేష్ నాయక్ అత్తమామలకు ఫోన్ చేసి మీ కూతురు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. తమ కూతురుది ఆత్మహత్య కాదని, అల్లుడే చంపేశాడంటూ రోజా కుటుంబసభ్యులు ఆరోపిస్తూ అతడి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన విరమింపచేశారు. రోజా మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. Also Read:


By July 20, 2020 at 11:29AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-commits-suicide-in-ranga-reddy-district-over-dowry-harassment/articleshow/77060788.cms

No comments