Breaking News

చిరంజీవి న్యూ లుక్.. సోషల్ మీడియాలో వైరల్


సరికొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. క్లీన్ షేవ్‌తో మీసాలు, గడ్డాలు లేకుండా .. యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా చిరు న్యూలుక్ ట్రెండ్ అవుతోంది. తాజాగా చిరు ఆచార్య సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సైరా సినిమా తర్వాత చిరంజీవి చేస్తున్న చిత్రం ఇదే కావడంతో దీనికి మరింత ప్రాధాన్యత పెరిగింది. దీంతో తన కొత్త సినిమా విషయంలో చిరు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కమర్షియల్ ఫార్మాట్‌లో మరోసారి సరికొత్తగా కనిపించాలని చిరు సిద్ధమవుతున్నారు. ఇటీవల బ్లఫ్ మాస్టర్ సినిమా చూసిన చిరు దర్శకుడిని ప్రత్యేకంగా అభినందించారు. అతనితో ఫోటోకి స్టిల్ ఇవ్వడంతో ఇంటర్నెట్ లో ఆ న్యూ లుక్ లీక్ అయ్యింది. చిరు కొత్త లుక్ చూసిన మెగా అభిమానులంతా పండగ చేసుకుంటున్నారు. మా బాస్ సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికీ కరోనా కష్ట కాలంలో చిరు సినీ కార్మికులకు ఆర్థిక సాయం అందించారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని కూడా తన అభిమానులతో షేర్ చేస్తూ వస్తున్నారు. Read More: మరోవైపు చిరు ఆచార్య సినిమాపై ఆయన అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా హీరోయిన్ పై అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో నలుగురు హీరోయిన్స్ ఉంటారన్న టాక్ కూడా వచ్చింది. ఆచార్యలో మెయిన్ హీరోయిన్ గా రెజీనా కసాండ్రా కనిపించబోతోందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించి రెజీనాపై ఒక పాటను కూడా చిత్రీకరించారు. అంతే కాకుండా మాస్ ఆడియెన్స్ కి కిక్కిచ్చేలా స్పెషల్ సాంగ్ ఉండాలని నిర్మాత, దర్శకుడు భావించారు. అందుకే ఆ పాత్ర కోసం తమన్నా భాటియాను సెలెక్ట్ చేసినట్లు కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే ఆచార్య సినిమాలో చిరు లుక్‌కు సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. తాజాగా చిరు కొత్త లుక్ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.


By July 20, 2020 at 11:33AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/megastar-chiranjeevi-new-look-go-viral-in-social-media/articleshow/77060840.cms

No comments