Breaking News

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగమైన దిగాంగనా సూర్యవంశీ.. బాధ్యతగా అందరూ మొక్కలు నాటాలని పిలుపు


రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 3వ విడత కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతోంది. ఆయన పిలుపు మేరకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో భాగమవుతున్నారు. పలువురు నటీనటులు, దర్శకనిర్మాతలు ఎవరికి వారు పెద్దఎత్తున మొక్కలు నాటి తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలలో తెలియజేస్తున్నారు. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతూ భావితరాలకు మెరుగైన వాతావరణం ప్రసాదించడంలో అంతా భాగం కావాలని పిలుపునిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి తన వంతుగా మొక్కలు నాటింది హీరోయిన్ . ముంబైలోని తన నివాసంలో మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా మంచి కార్యక్రమం అని, ఈ ఛాలెంజ్ లోకి తనను ఆహ్వానించిన దర్శకుడు సంపత్ నందికి ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలిపింది. ఈ బృహత్తర కార్యక్రమంలో అందరూ పాల్గొని బాధత్యగా మొక్కలు నాటాలని ట్విట్టర్ ఖాతాలో తన అభిప్రాయాన్ని పంచుకుంది. Also Read: టీవీ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన దిగాంగనా సూర్యవంశీ.. వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇప్పటికే హిందీ, తమిళ, తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. ప్రస్తుతం ‘’ సినిమాలో టీవీ రిపోర్టర్‌గా నటిస్తోంది. సంపత్‌ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో గోపీచంద్, తమన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. అతి త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


By July 19, 2020 at 11:07AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/heroine-digangana-suryavanshi-participated-in-green-india-challenge/articleshow/77047088.cms

No comments