Breaking News

ఆ హీరో సినిమాపై మహేష్ బాబు ప్రశంసలు.. ప్రత్యేకంగా ట్వీట్ కూడా


సూపర్ స్టార్ లాక్‌డౌన్‌తో ప్రస్తుం ఇంట్లోనే ఉంటూ.. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు. తాజాగా మహేష్ ఓ సినిమాపై ట్వీట్ చేశారు. తమిళ సినిమా ‘ఓ మై కడవులే’పై మహేష్ ట్వీట్ చేశారు. ఆ సినిమాకు చెందిన యూనిట్ పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. మిళంలో అశోక్ సెల్వన్‌, రితికా సింగ్ హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఓ మై కడవులే'. ఇందులో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. అశ్వథ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ప్రమఖులు సైతం ప్రశంసిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన టాలీవుడ్‌ హీరో మహేశ్‌బాబు చిత్ర యూనిట్‌ను ట్విటర్‌ వేదికగా అభినందించారు. డైరెక్టర్‌ అశ్వథ్‌ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని మహేశ్ ప్రశంసించారు. ఈ సందర్భంగా సూపర్‌స్టార్ మహేశ్‌కు డైరెక్టర్‌ అశ్వథ్‌ సహా మొత్తం చిత్ర యూనిట్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో కూడా రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. Read More: మహేష్ తాజాగా సర్కారు వారి పాట అంటు కొత్త సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ పరుశురాం దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే మహేష్ తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌తో పాటు.. టైటిల్ కూడా ప్రకటించారు. తెలుగు తెరపై రానీ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో బ్యాంక్ మోసాల నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.


By July 19, 2020 at 10:46AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mahesh-babu-complements-to-tamil-movie-oh-my-kadavule/articleshow/77046883.cms

No comments