అల్లుడితో అక్రమ సంబంధం.. భర్తకు తెలిసిపోవడంతో ఇద్దరూ కలిసి
అల్లుడి వరుసయ్యే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వివాహిత ఆ విషయం భర్తకు తెలిసిపోయిందన్న ఆందోళనతో ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని జిల్లాలో వెలుగుచూసింది. మదనాపురం మండలం భౌసింగ్‌తండా పంచాయతీ పరిధిలోని స్కూలుగుట్ట తండాకు చెందిన దేవమ్మ(30)కు అదే ప్రాంతానికి చెందిన రాజుతో పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. రాజు బుల్డడోజర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. Also Read: ఈ క్రమంలోనే దేవమ్మ మేనల్లుడి వరుసయ్యే శివ నాయక్(20) అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త లేని సమయంలో శివను ఇంటికే పిలిపించుకుని రాసలీలలు కొనసాగించేది. ఈ క్రమంలోనే శుక్రవారం ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో రాజు ఇంటికి రావడంతో వారి బండారం బయటపడింది. Also Read: దీంతో ఆందోళన చెందిన ఇద్దరూ మండలంలోని దుప్పల్లి గ్రామ శివారు కొన్నూరు క్రాస్ రోడ్డు వద్దకు చేరుకున్నారు. పెద్దతొక్కుడోని బండపై పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అంతకుముందే శివనాయక్ తన తండ్రికి ఫోన్ చేసి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సమాచారం ఇచ్చారు. ఆందోళనకు గురైన ఆయన వెంటనే దుప్పల్లికి చేరుకొని చూడగా అప్పటికే ఇద్దరు ఆపస్మారక స్థితిలో పడి ఉన్నారు. Also Read: స్థానికుల సాయంతో ఆ ఇద్దరిని 108 వాహనంలో వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ దేవమ్మ చనిపోయింది. శివనాయక్ పరిస్థతి విషమంగా ఉండటంతో మహబూబ్‌నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి ఒంటి గంటకు ప్రాణాలు కోల్పోయాడు. పంచనామా నిర్వహించిన అనంతరం పోలీసులు ఇద్దరి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. రెండు కుటుంబాల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:
By July 19, 2020 at 10:37AM
No comments