Breaking News

గుంటూరు: మైనర్ బాలికపై కన్నేసిన మారుతండ్రి.. న్యూడ్ వీడియోలతో బ్లాక్‌మెయిల్


కూతురి లాంటి బాలికపై కామంతో రెచ్చిపోతున్న ఓ కామాంధుడి ఉదంతమిది. ఆమె స్నానం చేస్తున్నప్పుడు వీడియోలు, ఫోటోలు తీసి వాటితో బెదిరిస్తూ తన కోరిక తీర్చాలని వేధిస్తున్నాడు. ఈ దారుణ ఘటన జిల్లాలో వెలుగుచూసింది. తన కూతురిని రెండో భర్త వేధిస్తున్నాడంటూ బాధితురాలు సోమవారం గుంటూరు రూరల్ ఎస్పీ గ్రీవెన్స్‌లో ఏఎస్పీ మూర్తికి ఫిర్యాదు చేసింది. Also Read: బాధితురాలి కథనం ప్రకారం.. తెనాలికి చెందిన ఓ మహిళ మనస్పర్థల కారణంగా భర్త నుంచి విడాకులు తీసుకుంది. కూతురు, కొడుకుతో కలిసి ఓ ప్రాంతంలో నివసిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు శ్రీనివాసరావు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కొద్దిరోజులు సహజీవనం తర్వాత పెద్దల సమక్షంలో ఆమెను వివాహమాడాడు. అయితే శ్రీనివాసరావుకు అప్పటికే మరో యువతితో అక్రమ సంబంధం ఉంది. దీంతో వివాహం చేసుకున్న మహిళను, ఆమె ఇద్దరు బిడ్డలను వేధించడం మొదలుపెట్టాడు. Also Read: మైనర్ అయిన ఆమె కూతురు స్నానం చేస్తున్న సమయంలో వీడియోలు, ఫోటోలు తీసి తన కోరిక తీర్చాలంటూ బెదిరించేవాడు. కూతురిలాంటి బిడ్డపై మోహం పెంచుకోవడం సరికాదని భార్య చెప్పినా వినిపించుకోలేదు. నీ కూతురితో నా కోరిక తీర్చకపోతే.. నీ కొడుకు ప్రాణం తీస్తానంటూ బ్లాక్‌మెయిల్ చేసేవాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు సోమవారం ఆ కామాంధుడిపై ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఏఎస్పీ మూర్తి బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. Also Read:


By July 28, 2020 at 08:40AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/step-father-sexual-harassment-on-minor-daughter-in-guntur-district/articleshow/77211018.cms

No comments