పెళ్లయి నాలుగు రోజులకే వరుడి ఆత్మహత్య.. ప్రకాశం జిల్లాలో విషాదం
ఆ నవ దంపతులకు నాలుగు రోజుల క్రితమే పెళ్లయింది. వధువు ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టింది. ఏమైందో తెలీదు గానీ వరుడు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకోవడంతో వధువుతో పాటు రెండు కుటుంబాలు, బంధువులు షాకయ్యారు. ఈ ఘటన తాళ్లూరు మండలంలో సోమవారం జరిగింది. మండలం పుట్టచెరువుపాలేనికి చెందిన ఎస్.వేణు(30) ఇంజినీరింగ్ పూర్తి చేశారు. సరైన ఉద్యోగం రాకపోవడంతో గ్రామంలోనే పొలం పనులు చేసుకుంటూ చిట్టీలు నిర్వహిస్తున్నాడు. Also Read: ఈ క్రమంలోనే జరుగుమల్లి మండలం పమిడిపాడుకు చెందిన ఓ యువతితో అతడిక ఈ నెల 24న వివాహమైంది. సోమవారం వేణు తాళ్లూరు మండలం సూరాయపాలెంలోని సుబాబుల్ తోటలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పశువుల కాపరుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతుడిని గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వేణు సోదరుడు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెళ్లయినా నాలుగో రోజు అతడు ఆత్మహత్య చేసుకోవడంతో పుట్టచెరువుపాలెంలో విషాద చాయలు అలుముకున్నాయి. Also Read:
By July 28, 2020 at 08:54AM
No comments