Breaking News

తిరుపతి: లాక్‌డౌన్‌లో బయటికొచ్చాడని యువకుడి పళ్లు ఊడగొట్టిన పోలీసులు


కరోనా కేసుల తీవ్రత కారణంగా తిరుపతిలో మళ్లీ లాక్‌డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అత్యవసరమైతే తప్ప ప్రజలు రోడ్లపైకి రావొద్దంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి కర్ఫ్యూ సమయంలో బైక్‌పై బయటకు వచ్చిన ఓ యువకుడు పోలీసులు ఆపినా ఆగకుండా ముందుకు వెళ్లిపోయాడు. దీంతో ఆగ్రహించిన పోలీసలు లాఠీతో అతడి నోటిపై కొట్టడంతో రెండు పళ్లు ఊడిపోయాయి. Also Read: సోమవారం రాత్రి 7 గంటల సమయంలో ఎస్టీవీ నగర్‌కు చెందిన జయచంద్ర ప్రసాద్‌(19) అనే యువకుడు బైక్‌పై అన్నమయ్య సర్కిల్‌ వైపు వెళుతున్నాడు. పల్స్‌ సర్కిల్‌ వద్ద తనిఖీ చేస్తున్న పోలీసులు అతడి బైక్‌ ఆపేందుకు ప్రయత్నించగా జయచంద్ర ఆగకుండా ముందుకు వెళ్లిపోయాడు. దీంతో మరికొంత దూరంలోని సర్వీసింగ్‌ సెంటర్‌ వద్ద ఉన్న స్పెషల్‌ పార్టీ కానిస్టేబుల్‌ లాఠీ చూపుతూ ఆపమని హెచ్చరికలు చేసినా అతడు భయంతో ఆగలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన కానిస్టేబుల్ తన చేతిలో ఉన్న లాఠీతో గట్టిగా కొట్టగా అది నోటిపై పొరపాటున నోటిపై తగిలింది. దీంతో జయచంద్రకు రెండు పళ్లు ఊడిపోయి రక్తం కారింది. Also Read: ఈ విషయం తెలుసుకున్న ఈస్ట్ పోలీస్‌స్టేషన్ సీఐ బీవీ శివప్రసాద్‌రెడ్డి వెంటనే అక్కడికి చేరుకుని బాధితుడిని మున్సిపల్ ఆఫీసు సమీపంలోని ఓ ప్రైవేట్ డెంటల్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న బాధితుడి బంధువులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. బైక్ ఆపకపోతే లాఠీతో కొట్టేస్తారా? అంటూ పోలీసులను నిలదీశారు. దాడికి పాల్పడ్డ కానిస్టేబుల్‌ క్షమాపణ చెప్పాలంటూ ఆందోళన చెప్పారు. సీఐ వారిని స్టేషన్‌కు పిలిపించి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. చికిత్స అనంతరం బాధితుడిని పోలీసులు ఇంటి దగ్గర వదిలిపెట్టారు. Also Read:


By July 28, 2020 at 08:27AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tirupati-police-attacked-on-young-man-over-he-did-not-stop-bike/articleshow/77211266.cms

No comments