మహబూబ్‌నగర్ జిల్లాలో లారీ బోల్తా.. నలుగురి మృతి, ఏడుగురికి గాయాలు
జిల్లాలో బుధవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామంలోని ఎక్కలదాయమ్మ చెరువు కట్టమీదుగా అక్రమంగా కర్ర లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో లారీలో 11 మంది కూలీలు ఉండగా.. వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను ఆంబోతు హర్యా, ఆంబోతు గోవిందర్, ఆంబోతు మధు, రాట్ల ధూర్యాగా పోలీసులు గుర్తించారు. Also Read: ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన ఏడుగురు కూలీలను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం తెలియగానే డీఎస్పీ వెంకటరమణ, సీఐ చేరాలు, ఎస్ఐ నగేష్, ఆర్డీవో ఈశ్వరయ్యలు వెంటనే అక్కడికి చేరుకుని సహాయచర్యలు పర్యవేక్షించారు. లారీలో ఉన్న వారందరూ రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆంబోతులా తండాకు చెందిన వారుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. Also Read:
By July 16, 2020 at 07:55AM
No comments