ఆస్తిలో వాటా అడిగిన ప్రియురాలు... చంపేపి పొలంలో పాతిపెట్టిన ప్రియుడు
ఆస్తిలో వాటా అడిగిన ప్రియురాలిని దారుణంగా చంపేసి తన పొలంలోనే పాతిపెట్టేశాడో వ్యక్తి. ఈ ఘటన కర్ణాటకలోని హగరిబొమ్మనహళ్లి ప్రాంతంలో బుధవారం వెలుగుచూసింది. హగరిబొమ్మనహళ్లి తాలూకా గిరిగూండనహళ్లి గ్రామానికి చెందిన డి.హులిగమ్మ (42)కు హొసపేటెకు చెందిన వ్యక్తితో చాలా ఏళ్ల క్రితం వివాహమైంది. కొద్దిరోజులకే కుటుంబ కలహాలతో భర్తను వదిలేసి పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలోనే అదే మోరగెరు గ్రామానికి చెందిన సిద్ధలింగప్పతో ఆమెకు పరిచయమై అక్రమ సంబంధానికి దారితీసింది. Also Read: 15ఏళ్లుగా సిద్ధలింగప్ప ఆమె కుటుంబాన్ని కూడా తానే పోషిస్తున్నాడు. అతడికి భారీగా ఆస్తులున్నట్లు తెలుసుకున్న హులిగమ్మ అందులో తనకు వాటా ఇవ్వాలంటూ కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది. అయితే ఆస్తి మొత్తం తన కుటుంబానికి చెందుతుందని, తన కోరికలు తీరుస్తున్నందుకు నెలనెలా ఎంతో కొంత ఇస్తున్నప్పుడు మళ్లీ ఆస్తిలో వాటా ఎందుకివ్వాలని అతడు హులిగమ్మకు చెప్పాడు. ఇదే విషయంపై కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో ప్రియురాలిని అడ్డు తొలగించుకోవాలనుకున్న సిద్ధలింగప్ప ప్లాన్ ప్రకారం ఈ నెల 13వ తేదీన ఆమెను గద్దికెరె- మోరగెరె గ్రామాల మధ్య ఉన్న తన పొలానికి తీసుకెళ్లాడు. ఆమెను చంపేసి తన పొలంలోనే పాటిపెట్టి వెళ్లిపోయాడు. Also Read: రెండ్రోజులుగా హులిగమ్మ కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో ఆమెకు సిద్ధలింగప్పతో అక్రమ సంబంధం ఉందని వెల్లడి కావడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు బుధవారం పొలానికి చేరుకున్న పోలీసులు హులిగమ్మ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం చేయించారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరు పరిచి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. Also Read:
By July 16, 2020 at 07:24AM
No comments