Breaking News

కామాంధుడి దాహానికి తల్లీకూతుళ్లు బలి... హైదరాబాద్‌లో దారుణం


కుటుంబ కలహాల కారణంగా భర్తకు దూరంగా ఉంటున్న మహిళపై కన్నేసిన ఓ కామాంధుడు ఆమెను బెదిరించి శారీరకంగా లోబరుచుకుంటూ అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. అయినా అతడి కామం చల్లారక ప్రియురాలి కూతురితో కూడా కామం తీర్చుకున్నాడు. ఆమె ఇంటికి వెళ్లిన సమయంలో బాలిక ఒంటరిగా ఉండటంతో బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆదివారం బాధితురాలు అనారోగ్యానికి గురికావడంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లగా ఈ ఘోరం బయటపడింది. తనతో పాటు కూతురి జీవితాన్ని కూడా నాశనం చేసిన ఈ కామాంధుడిపై మహిళ ఫిర్యాదు పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన తాలూకు వివరాలిలా ఉన్నాయి. Also Read: వనస్థలిపురంలోని శ్రీ శ్రీనివాసపురం కాలనీలో నివాసముంటున్న మహిళకు 2003లో వివాహం జరిగింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా 2010 నుంచి భర్త నుంచి విడిపోయి పదేళ్లుగా తన పిల్లలతో కలిసి ఒంటరిగా నివాసముంటోంది. తన భర్తకు పరిచయస్థుడైన ఇబ్రహీంపట్నం పటేల్‌గూడ గ్రామానికి చెందిన జి.నర్సింహయాదవ్‌(50) తరుచూ ఆమె ఇంటికి వచ్చి బాగోగులు చూస్తుండేవాడు. ఈ క్రమంలోనే ఓ రోజు ఆమెకు మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు. అప్పటినుంచి ఆమెను బెదిరిస్తూ లైంగిక వాంఛలు తీర్చుకుంటూ వస్తున్నాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే నీతో పాటు బిడ్డలను కూడా చంపేస్తానని బెదిరించడంతో ఆమె మౌనంగా ఉండిపోయింది. Also Read: జూన్‌ 22న నర్సింహయాదవ్‌ ఆమె ఇంట్లో లేని సమయంలో అక్కడికి వెళ్లాడు. ఒంటరిగా ఉన్న ఆమె కూతురిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లికి ఈ విషయం చెబితే అందరినీ చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక ఈ విషయాన్ని గుట్టుగా ఉంచింది. ఆదివారం అనారోగ్యానికి గురికావడంతో అసలు విషయం తల్లికి చెప్పింది. దీంతో ఆమె వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి నర్సింహయాదవ్‌‌పై ఫిర్యాదు చేసింది. తనను శారీకకంగా లోబర్చుకొని బెదిరిస్తుండటమే కాకుండా, తన కుమార్తెపైనా అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. Also Read:


By July 06, 2020 at 08:33AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-arrested-for-raping-woman-and-her-daughter-in-hyderabad/articleshow/76805782.cms

No comments