జీవితంలో అది నిరంతర ప్రక్రియ.. ఎంత కష్టమొచ్చినా!! యాంకర్ సుమ సందేశం
యాంకర్ సుమ.. ఈమె గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. బుల్లితెర ప్రోగ్రామ్ అయినా.. వెండితెర సినిమా ఈవెంట్ అయినా సుమ కనిపిస్తే చాలు ఆ స్టేజ్, అక్కడి వాతావరణం సందడి సందడిగా మారాల్సిందే. ఇక సుమ వాక్చాతుర్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఎదుట ఎంతటి గొప్ప వ్యక్తి ఉన్నా సరే తన మాటలతోనే బుట్టలో పడేస్తుంటుంది . అంతేకాదండోయ్.. సందర్బానుసారంగా పంచులేయడంలో సుమను మించిన మరో వ్యక్తి లేరనే చెప్పుకోవాలి. ఇదిలాఉంటే వ్యక్తిగత జీవితంపై గత కొంతకాలంగా ఎన్నో వార్తలు షికారు చేస్తున్నాయి. భర్త రాజీవ్ కనకాలతో ఆమెకు విభేదాలు తలెత్తాయని, ఆ ఇద్దరూ విడిగానే ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సుమ కనకాల షేర్ చేసిన వీడియో, దానిపై ఆమె రాసిన సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also Read: ఆహ్లాదకర వాతావరణంలో పచ్చని చెట్ల మధ్య పరుగెడుతూ ఆ వీడియోలో కనిపించిన సుమ.. వాటిని చూసి చాలా నేర్చుకోవాలంటూ వేదాంతం వల్లించింది. ఈ ఆకుపచ్చ, ఎరుపు వర్ణాలు కంటికి అదేవిధంగా ఆత్మకు ప్రశాంతత ఇస్తున్నాయి. సంతోషం అనేది జీవితంలో నిరంతర ప్రక్రియ అని, అది ఏ ఒక్క సమయానికో పరిమితం కాదని పేర్కొంది సుమ. అంటే వృక్షాలు ఎలాగైతే కాలాలను బట్టి మారతాయో.. మనం కూడా పరిస్థితులను బట్టి మారుతూ ఎంత కష్టమొచ్చినా ఎప్పుడూ సంతోషంగా, ఆహ్లాదంగా ఉండాలని చెబుతోంది సుమ. ఆమె పెట్టిన ఈ సందేశాన్ని అర్థం చేసుకున్న నెటిజన్స్.. ''సూపర్ సుమక్క బాగా చెప్పావ్'' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
By July 06, 2020 at 09:15AM
No comments