Breaking News

అక్రమ సంబంధం కోసం ఘాతుకం.. భర్తను చంపి ఇసుకలో పాతిపెట్టిన మహిళ


పరాయి వ్యక్తితో పెట్టుకుని కట్టుకున్న భర్తనే కడతేర్చిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని కొప్పళ జిల్లా భైరాపురకు చెందిన నింగప్ప, యమునవ్వకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలున్నారు. అయితే కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన శివకుమార్‌ తళవార్‌తో యమునవ్వ సన్నిహితంగా ఉండేది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న నింగప్ప పద్ధతిగా ఉండాలంటూ భార్యను హెచ్చరించేవాడు. ఇదే విషయంపై దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. Also Read: దీంతో తన సుఖానికి అడ్డొస్తున్న భర్తను చంపేయాలని యమునవ్వ ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. ఈ నెల 2న రాత్రి నిద్రపోతున్న భర్తను తాళ్లతో బంధించి శివకుమార్‌కు కబురుపెట్టింది. అతడు తన ఫ్రెండ్ విజయ్ ఉప్పార్‌తో కలిసి ఆమె ఇంటికెళ్లి నింగప్పను చంపేశాడు. అనంతరం నింగప్ప మృతదేహాన్ని గ్రామంలోని వాగులో ఇసుక కింద పాతిపెట్టారు. తర్వాతి రోజు యమునవ్వ ఏమీ ఎరుగనట్లుగా తన భర్త కనిపించడం లేదంటూ అళవండి పోలీసులకు ఫిర్యాదు చేసింది. Also Read: దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు యమునవ్వపైనే అనుమానం కలిగింది. ఆమె కాల్స్‌డేటా పరిశీలించడంతో పాటు లోతుగా దర్యాప్తు చేయగా అక్రమ సంబంధం బయటపడింది. దీంతో ఆమెతో పాటు ప్రియుడు శివకుమార్‌‌తో పాటు అతడి స్నేహితుడు విజయ్‌ని అరెస్ట్ చేసి విచారించగా నేరం అంగీకరించారు. Also Read:


By July 06, 2020 at 08:53AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-kills-her-husband-with-help-of-boy-friend-in-karnataka/articleshow/76806175.cms

No comments