జంగారెడ్డిగూడెంలో క్షుద్ర పూజలతో కలకలం.. పోలీసుల అదుపులో ఐదుగురు
కరోనా వైరస్‌తో బెంబేలెత్తిపోతున్న పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర కలకలం రేపాయి. జంగారెడ్డిగూడెం మండలం కేతవరం పంచాయతీ పరిధి కృష్ణంపాలెం గ్రామంలో శనివారం అర్ధరాత్రి క్షుద్రపూజలు చేస్తుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ముగ్గురు కలిసి గ్రామ శివారులో క్షుద్రపూజలు నిర్వహించారు. Also Read: అర్ధరాత్రి అరుపులు, భీతిగొల్పేలా మంత్రాలు విన్న కొందరు గ్రామస్థులు అక్కడికి వెళ్లి చూడగా క్షుద్రపూజలు కొనసాగుతున్నాయి. దీంతో గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఆదివారం ఈ ఘటనపై గ్రామంలో రెండు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. దీనిపై పెద్దలు కలగజేసుకుని వివాదాన్ని సద్దుమణిగించారు. Also Read:
By July 20, 2020 at 07:51AM
No comments