మద్యానికి బానిపై.. భార్య పిల్లల దారుణ హత్య
మద్య మత్తులో కొందరు తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. చక్కని తమ కుటుంబాల్ని చేజేతులారా చంపుకుంటున్నారు. మద్యానికి బానిసన ఓ వ్యక్తి తన భార్యా పిల్లల్ని అత్యంత దారుణంగా హతమర్చాడు. ఈ ఘటన ఔటర్ ఢిల్లీలోని నీహాల్ విహార్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గగన్, ప్రీతి భార్యాభర్తలు. కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి తొమ్మిదేళ్ల బాలుడు, ఐదేళ్ల కూతురు ఉన్నారు. అయితే మద్యానికి బానిసైన గగన్ నిత్యం మద్యం తాగుతూ కుటుంబ సభ్యులను హింసించేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం ప్రీతిపై సుత్తితో దాడి చేసి చంపేశాడు. ఆమె శరీరంపై చాలా చోట్ల గాయాలు ఉన్నాయి. కుమారుడి చేతులు, కాళ్లు కట్టేసి చంపేశాడు. కూతురు కూడా చనిపోయి రక్తపు మడుగులో పడి ఉంది. ఈ ముగ్గురిని చంపేసిన అనంతరం గగన్ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రీతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మూడు హత్యల ప్రధాన నిందితుడు గగనే అని ప్రీతి తల్లిదండ్రులు ఆరోపించారు. గగన్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తన భార్యతో పాటు.. అల్లారు ముద్దుగా కనిపించే ఇద్దరు పిల్లల్ని కూడా గగన్ ఇలా చంపేయడంతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు గగన్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
By July 20, 2020 at 07:51AM
No comments