మోజు తీరాక మొహం చాటేసిన ప్రియుడు.. దిమ్మతిరిగే షాకిచ్చిన యువతి
ప్రేమిస్తున్నానంటూ వెంటబడ్డాడు. ప్రేమను అంగీకరించాక పెళ్లి చేసుకుంటానంటూ షికార్లకు తిప్పాడు. ఈ క్రమంలోనే ఆమెకు శారీరకంగా దగ్గరై కోరికలు తీర్చుకుంటూ వచ్చాడు. కొద్దిరోజులు అయ్యాక నీపై మోజు తీరిపోయిందంటూ మొహం చాటేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు ప్రియుడి ఇంటి ఎదుట నిరాహార దీక్ష చేపట్టింది. ఈ ఘటన జిల్లాలో జరిగింది. Also Read: గ్రామీణ మండలంలోని పెదమక్కెన గ్రామానికి చెందిన ఓ యువతి శుక్రవారం ప్రియుడి ఇంటి ఎదుట నిరాహార దీక్ష చేపట్టింది. తన ఇంటి ఎదురుగా ఉండే యువకుడు తనను ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడని, కొంతకాలంగా తనతో శారీరక కోరికలు తీర్చుకుంటూ పెళ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించాడని బాధితురాలు చెబుతోంది. తనకు న్యాయం చేసేవరకు దీక్ష విరమించేది లేదని తేల్చి చెబుతోంది. తన ప్రియుడిని తల్లిదండ్రులు వేరే ప్రాంతానికి తరలించి నాటకమాడుతున్నారని ఆరోపిస్తోంది. Also Read: అయితే ఈ విషయంపై స్పందించిన యువకుడి తల్లి.. తమ కొడుకు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడని, ఆదివారం అతడిని ఇంటికి పిలిపించి చర్చిస్తామని చెబుతోంది. యువతి దీక్ష విరమిస్తేనే చర్చలకు అవకాశముంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని సత్తెనపల్లి పోలీసులు తెలిపారు. Also Read:
By July 04, 2020 at 08:49AM
No comments