గుడివాడలో గంజాయి దందా గుట్టురట్టు.. పోలీసులపై పెద్దల ఒత్తిడి
కృష్ణా జిల్లా పట్టణంలో గంజాయ్ రాకెట్ గుట్టు బయటపడింది. సీఐగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన గోవిందరాజులు తీగ లాగితే డొంక కదిలి గుట్టు రట్టయింది. పట్టణంలోని రాజేంద్రనగర్‌లో గల ఓ కార్పొరేట్ స్కూల్ ఎదురుగా ఉన్న బడ్డీ కొట్టు నిర్వహించే తండ్రీకొడుకులు కొంతకాలంగా గంజాయి వ్యాపారం భారీస్థాయిలో నిర్వహిస్తున్నారు. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్లో ఇటీవల బాధ్యతలు చేపట్టిన సీఐ గోవిందరాజులుకు సమాచారం రావడంతో నిఘా పెట్టారు. ఈ సందర్భంగా తండ్రీకొడుకులతో పాటు వారికి గంజాయి సరఫరా చేసేవారు, గంజాయి కొనుగోలు చేసేవారు ఇలా మొత్తం 18 మందిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. Also Read: ఈ విషయం బయటకు పొక్కగానే గుడివాడలోని ఇద్దరు ప్రముఖులు అనేకసార్లు పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి కేసులు పెట్టొద్దంటూ ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో గంజాయి రాకెట్ వెనుక పెద్దల హస్తం ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గుడివాడకు విశాఖ మన్యం నుంచి గంజాయి సరఫరా అవుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గుడివాడ నుంచి అక్కడి వెళ్లి స్థిరపడిన కొందరు వ్యక్తులే ఈ దందాను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గంజాయి విక్రయించే వారిని విచారిస్తే మరిన్ని విషయాలు బయటికొస్తాయని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. Also Read:
By July 04, 2020 at 09:10AM
No comments