మామ సింగరేణి ఉద్యోగం కోసం అల్లుడి కుట్ర... బావమరిదిని దారుణంగా
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న మామ మెడికల్‌గా అన్‌ఫిట్ కావడంతో ఆయన ఉద్యోగంపై కన్నేసిన అల్లుడు బావమరిదిని చంపేందుకు కుట్ర పన్నిన ఘటన తెలంగాణలోని జిల్లా హజీపూర్ మండలం ముల్కల్ల గ్రామంలో వెలుగుచూసింది. ముల్కల్లకు చెందిన నీలం తిరుపతి సింగరేణిలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అతనికి ఓ కుమార్తె, కుమారుడు క్రాంతికుమార్ ఉన్నారు. కూతురు పెద్దలను ఎదిరించి గోదావరిఖనికి చెందిన రేణికుంట నవీన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ ఉదంతంతో కొన్నాళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటున్న వారితో ఈ మధ్యే రాకపోకలు ప్రారంభమయ్యాయి. Also Read: కొద్దిరోజుల క్రితం తిరుపతి అనారోగ్యానికి గురికావడంతో సింగరేణి ఉద్యోగానికి మెడికల్ అన్‌ఫిట్ అయ్యాడు. దీంతో ఆ ఉద్యోగాన్ని తనకు ఇప్పించాలని అల్లుడు నవీన్ ఒత్తిడి చేస్తున్నాడు. అయితే కొడుకు ఉండగా ఆ ఉద్యోగాన్ని అల్లుడికి ఇప్పించడం ఇష్టం లేని తిరుపతి అతడిని పట్టించుకోవడం మానేశాడు. దీంతో కక్ష పెంచుకున్న నవీన్ బావమరిది హత్యకు కుట్ర పన్నాడు. ప్లాన్ ప్రకారం శుక్రవారం తన ముగ్గురు ఫ్రెండ్స్‌తో కలసి బావమరిది క్రాంతికుమార్‌పై కత్తితో దాడి పాల్పడ్డాడు. Also Read: ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన క్రాంతికుమార్‌ను కుటుంబసభ్యులు వెంటనే మంచిర్యాలలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో క్రాంతికుమార్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్లు డాక్టర్లు తెలిపారు. బాధితుడి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు నవీన్‌తో పాటు అతడి స్నేహితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By July 04, 2020 at 08:01AM
No comments