మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్‌జీ టండన్ కన్నుమూత
ఈరోజు ఉదయం కన్నుమూశారు. లాల్‌జీ టండన్ వయసు 85 ఏళ్లు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ, లక్నోలో చికిత్స పొందుతున్నారు. లాల్‌జీ టండన్ మరణాన్ని ఆయన కుమారుడు, యూపీ ప్రభుత్వ మంత్రి అశుతోష్ టండన్ తెలిపారు. బాబూజీ ఇక లేరని ఆయన ట్వీట్ చేశారు. అంతకుముందు లాల్‌జీ టండన్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిన నేపధ్యంలో వెంటిలేటర్‌పై ఉంచారు. ఈ విషయాన్ని లక్నోలోని మెదాంత హాస్పిటల్ డైరెక్టర్ రాకేశ్ కపూర్ తెలిపారు. జూన్ 11 న మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్‌జీ టండన్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం, మూత్రవిసర్జనలో ఇబ్బందుల కారణంగా లక్నోలోని మెదాంత ఆసుపత్రిలో చేరారు. లాల్‌జీ టండన్ ఆరోగ్యం రోజురోజుకు దిగజారింది. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌కు మధ్యప్రదేశ్ అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. మరోవైపు లాల్‌జీ మరణం పట్ల మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
By July 21, 2020 at 08:09AM
No comments