Prabhas 21: ప్రభాస్‌తో బాలీవుడ్ బ్యూటీ రొమాన్స్.. రియాక్ట్ అయిన కీర్తి సురేష్.. అమ్మడి ఫీలింగ్స్ చూస్తే!!
యంగ్ రెబల్ స్టార్ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ గుడ్ న్యూస్ చెప్పేసింది వైజయంతి మూవీస్ బ్యానర్. ఈ బ్యానర్ 50వ వార్షికోత్సవం సందర్భంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేను తెలుగు తెరకు పరిచయం చేస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ 21వ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనేను కన్ఫర్మ్ చేస్తూ భారీ అనౌన్స్‌మెంట్ చేశారు. ఇదే ఆమెకు టాలీవుడ్ తొలి సినిమా కానుంది. అయితే ప్రభాస్‌తో దీపికా రొమాన్స్ అని తెలియగానే మరో హీరోయిన్ తన ఫీలింగ్స్ బయటపెడుతూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టింది. తన ఇన్‌స్టాగ్రమ్‌లో ప్రభాస్- దీపికా జోడీపై తన స్పందన తెలిపిన కీర్తి.. ''ప్రభాస్‌తో దీపికా.. చాలా చాలా పెద్ద వార్త. మరో బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని రూపొందించడానికి ఓ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ సెట్టయింది. ఇక ఈ వెయిటింగ్‌ని తట్టుకోలేను'' అంటూ ప్రభాస్ 21పై జనాల్లో ఉన్న అంచనాలకు రెక్కలు కట్టే కామెంట్ చేసింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్న నాగ్ అశ్విన్.. మహానటి రూపంలో కీర్తి సురేష్‌కి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చి ఆమె నటనా ప్రతిభను వెలికితీశారు. ఈ క్రమంలోనే నాగ్ అశ్విన్ టాలెంట్, ప్రభాస్- దీపికా స్టార్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని కీర్తి ఇలా కామెంట్ చేసిందని చెప్పుకుంటున్నారు జనం. నాగ్ అశ్విన్ ఈ మూవీని పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించనున్నారు. సోషియో ఫాంటసీ మూవీగా భారీ బడ్జెట్ కేటాయించి రూపొందించనున్నట్లు టాక్. ప్రస్తుతం మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారట. ఈ మూవీ ప్రకటన వచ్చిన నాటినుంచే ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేసింది. ఇక ఇందులో హీరోయిన్ అని తెలిసి వాళ్లంతా పండగ చేసుకుంటున్నారు. మొత్తానికైతే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఫినిష్ కాకముందే ప్రభాస్ 21పై ఇంత హైప్ క్రియేట్ కావడం చూస్తుంటే ఈ మూవీ ఆయన కెరీర్‌లో మరో మైలురాయి కావడం ఖాయమే అనిపిస్తోంది కదూ!!.
By July 21, 2020 at 07:50AM
No comments