తనిఖీల్లో పట్టుకున్న మద్యంతో కానిస్టేబుళ్ల పార్టీ.. స్టేషన్‌లోనే అర్ధనగ్నంగా డ్యాన్సులు
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రజలు ఫంక్షన్లు, పార్టీల పేరుతో గుమిగూడవద్దని అధికారులు, పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. అయితే నిబంధనలకు తమకు వర్తించవంటూ జిల్లాలో పోలీసులు రెచ్చిపోయారు. ఓ కానిస్టేబుల్ పుట్టినరోజు వేడులక పేరుతో పోలీస్‌స్టేషన్‌నే క్లబ్‌గా మార్చేశారు. మద్యం తాగి అర్ధనగ్నంగా చిందులేస్తూ రెచ్చిపోయారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి పోలీస్‌స్టేషన్‌లో వెలుగుచూసింది. Also Read: బైరెడ్డిపల్లి పోలీసుస్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్ బలరాం పుట్టిన రోజు సందర్భంగా సిబ్బంది స్టేషన్‌లోనే పార్టీ చేసుకున్నారు. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న కర్ణాటక మద్యంతో పార్టీ చేసుకుని మత్తులో మునిగితేలారు. అంతటితో ఆగకుండా సినిమా పాటలకు అర్ధనగ్నంగా డ్యాన్సులు చేస్తూ వాటిని సెల్‌ఫోన్లో వీడియో తీసకున్నారు. వాటిని కానిస్టేబుళ్ల గ్రూపులో పోస్టు చేయడంతో విషయం ఉన్నతాధికారులకు చేరింది. Also Read: ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ వెంటనే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని డీఎస్పీ అరీఫుల్లాను ఆదేశించారు. ఆయన పంపిన నివేదిక ఆధారంగా కానిస్టేబుళ్లు బలరాంను మదనపల్లెకి, కార్తీక్‌ను ఐరాలకు, లోకేష్‌ను కేవీబీ పురానికి, హెడ్‌కానిస్టేబుల్ రెడ్డిశేఖర్‌ను సత్యవేడుకు బదిలీచేస్తూ ఎస్పీ సెంథిల్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. ఈ ఘటన పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. Also Read:
By July 31, 2020 at 09:01AM
No comments