అక్కాచెల్లెళ్లపై 8 మంది గ్యాంగ్ రేప్.. వీడియోలతో బ్లాక్‌మెయిల్
ఇద్దరు అక్కాచెల్లెళ్లపై 8 మంది కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నయారాయ్‌పూర్‌లోని బలోదా బజార్ ప్రాంతంలో ఇద్దరు బాలికలు(16, 14 ఏళ్లు) కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. మార్చి 31వ తేదీన వీరిద్దరూ తమ స్నేహితులతో కలిసి ఇంటికి వెళ్తుండగా 8 మంది యువకులు అడ్డగించారు. మిగతవారిని బెదిరించి అక్కాచెల్లెళ్లను ఎత్తుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంతో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. Also Read: ఈ తతంగాన్నంతా సెల్‌ఫోన్లో వీడియో తీశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో బాధితురాళ్లు నోరు మెదపలేదు. అయితే నిందితుల్లో ఒకరు ఇటీవల అక్కకు ఫోన్ చేసి లైంగికంగా వేధిస్తున్నాడు. తన కోరిక తీర్చకపోతే ఆ వీడియోలను సోషల్‌మీడియాలో పెట్టి పరువు తీస్తానంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. దీంతో విసిగిపోయిన అక్క రెండ్రోజుల క్రితం మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆశ్రయించింది. Also Read: మూడు నెలల క్రితం తనతో పాటు చెల్లెలిపైనా 8 మంది రేప్ చేశారని, ఇప్పుడు మరోసారి తమను వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి బుధవారం 11 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. Also Read:
By July 31, 2020 at 09:19AM
No comments