Breaking News

హీరో పేరు వాడేస్తూ నయా మోసం.. పోలీసులను ఆశ్రయించిన శరత్ కుమార్


పెరుగుతున్న టెక్నాలజీని తమకు అనువుగా వాడుకుంటూ నయా మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. సామాజిక మాధ్యమాలు, ఆన్ లైన్ వేదికలు ఉపయోగిస్తూ ఎదుటి వ్యక్తిని బురిడీ కొట్టించి లక్షలు, కోట్లలో సొమ్ము కాజేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చూస్తున్నాం. జనం వీక్‌నెస్ క్యాష్ చేసుకుంటూ సినీ ఇండస్ట్రీ, సెలెబ్రిటీల పేర్లతో భారీ సొమ్ము వసూలు చేస్తున్నారు. ఇటీవలే సింగర్ సునీత పేరుతో ఓ వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి రాగా.. తాజాగా కోలీవుడ్ నటుడు పేరు వాడుతూ ఓ వ్యక్తి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. శ‌ర‌త్ కుమార్ ‘అఖిల భార‌త స‌మ‌త్తుల మక్కల్ క‌ట్చి’ పేరుతో ఓ పార్టీని స్థాపించిన సంగ‌తి తెలిసిందే. ఈ పార్టీ పేరు చెప్పి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారట. ఈ విషయం శరత్ కుమార్ దృష్టికి రావడంతో వెంటనే అలర్ట్ అయిన ఆయన, స్వయంగా తానే రంగంలోకి దిగి ఆ వ్య‌క్తి వివరాలు ఆరాదీసి అతనితో ఫోన్‌లో మాట్లాడి హెచ్చరించారు. అతను కోవైకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అని తెలిసి.. అనంతరం పోలీసులను ఆశ్రయించారు శరత్ కుమార్. ఈ మేరకు చెన్నై పోలీస్‌కమిషనర్‌‌కు తన ఫిర్యాదు అందించారు. Also Read: ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాలు విస్తృతం కావడంతో సెల‌బ్రిటీల పేరు చెప్పి మోసం చేస్తున్న ఉదంతాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ప్ర‌జ‌లు కూడా త‌మ వంతు బాధ్య‌త‌గా జాగ్ర‌త్త ప‌డాల్సిన అవ‌స‌రం ఉందని చెబుతున్నారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా పోలీసులను ఆశ్రయించాలని అంటున్నారు.


By July 31, 2020 at 08:59AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sarathkumar-police-complaint-regarding-cyber-fraud/articleshow/77275186.cms

No comments