చిత్తూరు: వేధింపుల తాళలేక భర్త హత్య.. కోడలికి సాయం చేసిన అత్త
వేధింపులకు గురిచేస్తున్నాడనో, అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనో మహిళలు భర్తలను చంపడం చూస్తునే ఉన్నాం. దీనికి వారి కుటుంబసభ్యులో, స్నేహితులు, ప్రియుళ్లో సాయం చేస్తుంటారు. కానీ జిల్లాలో ఓ మహిళ భర్తను హత్య చేయగా.. దానికి సాక్షాత్తూ అత్తే సాయం చేయడం అందరినీ షాక్‌కు గురిచేసింది. Also Read: వివరాల్లోకి వెళ్తే... చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నక్కపల్లికి చెందిన భర్త లోకనాథరెడ్డి ఇటీవల భార్యను తీవ్రంగా వేధిస్తున్నాడు. ఇదే విషయంపై దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో లోకనాథరెడ్డి తల్లి కోడలికే మద్దతు తెలిపింది. రోజురోజుకీ అతడి ఆగడాలు పెరిగిపోవడంతో మనస్తాపం చెందిన భార్య మంగళవారం అతడిని చంపేసింది. Also Read: ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విచారణలో లోకనాథరెడ్డి హత్యలో భార్యతో పాటు తల్లి హస్తం కూడా ఉందని తెలుసుకుని పోలీసులు షాకయ్యారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:
By July 22, 2020 at 09:29AM
No comments