ఒంగోలులో అమానుషం.. వివాహితపై దాడి చేసి, జుట్టు కత్తిరించిన ప్రియుడి కుటుంబం
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
![](https://telugu.samayam.com/photo/77011099/photo-77011099.jpg)
ఒంగోలులో అమానుష ఘటన జరిగింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఒంటరి మహిళపై దాడికి పాల్పడి ఆమె జుట్టు కత్తిరించడంతో పాటు బంగారు నగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన టూ టౌన్ పోలీసులు గురువారం ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. స్థానిక రామ్‌నగర్‌లోని ఓ అపార్టుమెంటులో నివసించే మహిళకు 16 ఏళ్లక్రితం వివాహమైంది. ఆమెకు 15 సంవత్సరాల కొడుకు ఉన్నాడు. మనస్పర్థలతో కొన్నాళ్ల క్రితం భర్త నుంచి విడిపోయిన ఆమె మరో వ్యక్తితో కలిసి ఉంటోంది. Also Read: ఈ క్రమంలోనే కొణిజేడు బస్టాండు ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో ఆ యువకుడితో కొనసాగిస్తోంది. కొద్దిరోజుల క్రితం ఆ యువకుడికి డబ్బు అవసరం రావడంతో తల్లి బంగారు నగలు తెచ్చి ఆ మహిళ వద్ద తనఖా పెట్టి డబ్బు తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువకుడి కుటుంబసభ్యులు ఆ నగలను ఆవిడకు ఇచ్చేశాడనుకుని పొరబడ్డారు. తమ బిడ్డను మోసం చేసి నగలు దోచుకుందన్న కోపంతో ఆరుగురు సభ్యులు గురువారం ఆమె ఫ్లాట్‌కి వెళ్లి విచక్షణా రహితంగా దాడి చేశారు. Also Read: బాధితురాలి జుట్టు కత్తిరించటమే కాకుండా ఏడు ఉంగరాలు, బ్రాస్‌లెట్, నల్లపూసల దండ తీసుకెళ్లారు. దీనిపై సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు సంఘటనాస్థలానికి వెళ్లి దాడికి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులందరినీ ఒంగోలు ఆస్పత్రికి తరలించి కరోనా పరీక్షలు చేయించారు. ఫలితాలు వచ్చిన తర్వాతే వారిని కోర్టులో హాజరు పరుస్తామని సీఐ రాజేష్ తెలిపారు. Also Read:
By July 17, 2020 at 08:54AM
No comments