నా చావుకు దెయ్యం కారణమని.. విద్యార్థిని ఆత్మహత్య
చాలామంది విద్యార్థులు, యువతి యవకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒత్తిడి తట్టుకోలేక... ప్రేమ విఫలం, తల్లిదండ్రులు మందలించారనో ఇలా అనేక రకాల కారణాలతో ఇప్పటివరకు చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం మనం చూశాం. కానీ ఓ విద్యార్థిని మాత్రం తన చావుకు దెయ్యం కారణమంటూ లేఖ రాసి బలవర్మరణానికి పాల్పడింది. తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం... దిండుక్కల్ జిల్లా వేడచందూర్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కూలీ పనులు చేసుకొని బతుకు బండిని నెట్టుకొస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడున్నాడు. పెద్ద కుమార్తె కోయంబత్తూర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో రెండో ఏడాది నర్సింగ్ చదువుతోంది. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంటికి వచ్చేసింది. రెండు రోజుల క్రితం యువతి తన పుట్టినరోజు వేడుకలను కూడా సరదాగా చేసుకుంది. అప్పటి నుంచి ఆమెలో మార్పు వచ్చేసింది. సరిగా ఎవరితోనూ మాట్లాడకుండా సైలంట్‌గా ఉండటం ప్రారంభించింది. శుక్రవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. Read More: అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆమె గదిని తనిఖీ చేయగా ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన లేఖ ఒకటి లభ్యమైంది. అందులో... తన చావుకు కారణం దెయ్యమేనంటూ ఆమె పేర్కొంది. రాత్రిళ్లు నిద్రపట్టడం లేదని చనిపోయేందుకు రావాలని నన్ను పిలుస్తున్నట్లుగా ఉందని లేఖలో ఆమె పేర్కొంది. ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే ఇంట్లో వారందర్నీ చంపేస్తానని ఓ దెయ్యం తనను భయపెడుతోందని సూసైడ్ లేఖలో రాసి ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
By July 19, 2020 at 07:59AM
No comments