Breaking News

మరో గ్యాస్ లీక్ దుర్ఘటన.. నలుగురు కార్మికులు మృతి


ఘటనలు ప్రజల్ని వెంటాడుతున్నాయి. పనిచేస్తున్న ప్లాంట్లలో ఈ దుర్ఘటనలు జరుగుతుండటంతో అనేకమంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. విశాఖలో చోటు చేసుకుంటున్న వరుస ప్రమాదాలు మరువకముందే.... గుజరాత్‌లోని మరో గ్యాస్ లీకేజీ జరిగింది. అహ్మదాబాద్ జిల్లాలోని ధోలి గ్రామంలో గ్యాస్ లీక్ అయిన ఘటనలో నలుగురు మృతిచెందారు. సిమెజ్ సమీపంలో ఉన్న చిరిపాల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో గ్యాస్ లీక్ ఘటన చోటుచేసుకుంది. రసాయన వ్యర్థాలతో నిండిన ట్యాంక్ శుభ్రం చేయడానికి కార్మికులు ట్యాంక్‌లోకి దిగినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ నితేష్ పాండే తెలిపారు. అయితే ట్యాంక్ శుభ్రం చేస్తున్న సమయంలో లోపలి నుంచి వెలువడిన విష వాయువుల కారణంగా చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలే విశాఖ పరవాడలోని ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం జరిగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మనకు తెలిసిందే. కంపెనీ అధికారుల నిర్లక్ష్యం వల్లే కార్మికులు ప్రాణాలు పోగుట్టుకుంటున్నారంటూ పలువురు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.


By July 19, 2020 at 07:25AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/4-labourers-killed-in-alleged-gas-leak-in-gujarats-dholka/articleshow/77045567.cms

No comments