Rgv: రాజమౌళికి కరోనా పాజిటివ్.. రామ్ గోపాల్ వర్మ షాకింగ్ రియాక్షన్..! బాహుబలిని పిలవండి
వివాదాస్పద దర్శకుడు మరోసారి తన విలక్షణతను చాటుకున్నారు. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడుతూ ముఖం ముందే తన అభిప్రాయం చెప్పేసే వర్మ.. తాజాగా దర్శకధీరుడు అని తెలిసి ఎవ్వరూ ఊహించని విధంగా రియాక్ట్ అయ్యారు. రాజమౌళికి కరోనా పాజిటివ్ అని తెలియగానే సినీ ప్రముఖులంతా ఆయన కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్స్ పెడుతుండగా.. వర్మ మాత్రం తనదైన స్టైల్‌లో స్పందిస్తూ బాగోగులు కోరుకున్నారు. బుధవారం (జులై 29) రాత్రి తనకు, తన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ అని తేలినట్లుగా పేర్కొంటూ ట్వీట్ చేశారు రాజమౌళి. గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న తాము.. జ్వరం తగ్గిన తరువాత ఎలాంటి లక్షణాలు లేకపోయినా కూడా కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు రాజమౌళి తెలిపారు. దీంతో ఉలిక్కిపడ్డ టాలీవుడ్ సినీ లోకం ఆయన త్వరగా కోలుకోవాలంటూ ట్విట్టర్‌ని హోరెత్తించేసింది. ఇక రామ్ గోపాల్ వర్మ పెట్టిన వెరైటీ ట్వీట్ మాత్రం వైరల్ అయి వార్తల్లో నిలిచింది. Also Read: ''సర్.. మీ సైనికుడు బాహుబలిని పిలిచి కరోనాను ఓ తన్ను తన్నమనండి. జోక్స్ పక్కన పెడితే.. మీరు, మీ కుటుంబ సభ్యులు అతి త్వరలోనే కరోనా బారి నుంచి కోలుకుంటారు'' అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు వర్మ. దీంతో ఈ ఫన్నీ రియాక్షన్ చూసి వర్మ తీరు పట్ల మిశ్రమంగా స్పందిస్తున్నారు నెటిజన్లు. ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి RRR మూవీ చేస్తుండగా, వర్మ ఆన్‌లైన్ వేదికలపై పలు కాంట్రవర్షియల్ సినిమాలతో హంగామా చేస్తున్నారు.
By July 30, 2020 at 10:57AM
No comments