Breaking News

కెమెరా ముందు అలాంటి దుస్తుల్లో కనిపించను.. అదే జరిగితే: అందాల ఆరబోతపై సాయి పల్లవి రియాక్షన్


వెండితెరపై అతి తక్కువ సమయంలోనే నాచురల్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. ముద్దు ముద్దు మాటలు, అదిరిపోయే స్టెప్పులతో దక్షిణాది సినీ పరిశ్రమను హుషారెత్తించింది. అందాల ఆరబోతతో ఆకట్టుకుంటున్న హీరోయిన్లతో పోటీ పడుతూ ఎలాంటి ఎక్స్‌పోజింగ్ చేయకుండానే సత్తా చాటుతోంది. ఆమె చూపుతున్న అభినయం చూసి ఫిదా అయిపోయారు టాలీవుడ్ ప్రేక్షకులు. ఆచితూచి సినిమాలు ఎంచుకుంటూ వెళ్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్ విశేషాలు, సినిమాల్లో ఎక్స్‌పోజింగ్ లాంటి అంశాలపై స్పందించింది. ప్రస్తుతం కెరీర్ పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పిన సాయి పల్లవి.. ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్ కావాలని గానీ, పెద్ద సినిమాలు చేయాలని గానీ పెద్ద పెద్ద కోరికలు లేవని చెప్పుకొచ్చింది. ప్రేక్షులంతా తనను ఇంట్లో అమ్మాయిగానే చూస్తారే తప్ప పెద్ద హీరోయిన్‌గా చూడరని, అదే తనకు బాగా నచ్చుతుందని చెప్పింది. తన వద్దకు వచ్చిన కథ విని దాని గురించి మాత్రమే ఆలోచిస్తానని ఆమె తెలిపింది. అయితే కెమెరా ముందు పొట్టి దుస్తులు ధరించడం తనకు ఇష్టముండదని, ఒకవేళ ధరించినా అది తనకూ.. ప్రేక్షకులకు అంతగా సౌకర్యవంతంగా ఉండదని తెలిపింది సాయి పల్లవి. Also Read: ఇక సాయి పల్లవి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం దగ్గుబాటి రానా సరసన '' సినిమాలో నటిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర చిత్రానికే మేజర్ అసెట్ కానుందని టాక్. మరోవైపు నాగచైతన్యతో '' కూడా నడిపిస్తోంది సాయి పల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి పల్లవి చేసిన ఈ రెండు సినిమాల కోసం ప్రేక్షకలోకం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.


By July 19, 2020 at 09:29AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sai-pallavi-reaction-on-exposing-infront-of-camera/articleshow/77046333.cms

No comments