Breaking News

స్నేహితుల సాయంతో యువతిని ఎత్తుకెళ్లి రేప్.. నెల్లూరు జిల్లాలో ఘోరం


జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయిని ఓ యువకుడు స్నేహితుల సాయంతో కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. తనపై జరిగిన దారుణంపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ బాధితురాలు రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. పెళ్లకూరు మండలంలోని ఓ గ్రామానికి యువతి(20) ఏడాది క్రితం డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన యువకుడు ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అతడి ప్రతిపాదనను యువతి తిరస్కరించడంతో కక్ష పెంచుకున్నాడు. Also Read: ఈ నెల 11న ఇద్దరు స్నేహితుల సాయంతో యువతిని కిడ్నాప్ చేసిన యువకుడు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి తీసుకెళ్లాడు. అక్కడే ఓ గదిలో బంధించి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ కామాంధుడి బారి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు ప్రయత్నించినా మిగిలిన ఇద్దరూ ఆమెను అడ్డుకున్నారు. రెండ్రోజుల పాటు నరకం అనుభవించిన తర్వాత ఆమె రాత్రివేళ ఇంటికి సమీపంలో వదిలి వెళ్లిపోయారు. Also Read: జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పిన బాధితురాలు 16వ తేదీన స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఫిర్యాదు తీసుకోకుండా తెల్ల కాగితంపై సంతకాలు తీసుకుని పంపించేశారని బాధితురాలు ఆరోపిస్తోంది. పోలీసులు రెండ్రోజులు స్టేషన్‌కు తిప్పించుకుని ఆ తర్వాత పట్టించుకోవడం లేదంటూ ఆదివారం రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదును చేసింది. దీంతో పాటు నెల్లూరు జిల్లా ఎస్పీకి కూడా ఓ వినతిపత్రం పంపించి తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంది. Also Read:


By July 20, 2020 at 09:58AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-woman-kidnapped-and-raped-in-nellore-district/articleshow/77059402.cms

No comments