Breaking News

ఆగని వరకట్న వేధింపులు.. మరో వివాహిత బలి


ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. శిక్షలు అమలు చేసినా.. వారిపై దాడులు, అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ఇవాల్టికి మహిళల విషయంలో అన్యాయం జరుగుతూనే ఉంది. ఇక వరకట్న వేధింపుల చట్టం సైతం తీసుకువచ్చినా..నేటికి అదనపు కట్నానికి అబలలు బలైపోతునే ఉన్నారు. తాజాగా ఓ వివాహతి అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. షాద్ నగర్ రూరల్‌లోని ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని దూసకల్‌ గ్రామంలో ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ మండల కేంద్రానికి చెందిన బొమ్మగల్ల రాములు కూతురు శ్రీజ(20)ను గతేడాది మే 17న ఫరూఖ్‌నగర్‌ మండలం దూసకల్‌ గ్రామానికి చెందిన కల్లెపల్లి శ్రీనివాస్‌‌కు ఇచ్చి పెద్దలు వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో శ్రీజ తల్లిదండ్రులు రూ. 2 లక్షల కట్నం, 8తులాల బంగారం ఇచ్చారు. అయినా శ్రీజ అత్తింటికి ఆశ తీరలేదు. కొంతకాలంగా అదనపు కట్నం తీసుకురావాలని శ్రీజను తన భర్తతోపాటు అత్త, మామలు, బావ, తోటి కోడలు మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేశారు. Read More: దీంతో వేధింపులు తీవ్రమవడంతో ఆమె 3 నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. దీంతో శ్రీజ తల్లిదండ్రులు నందిగామలో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి అల్లుడు శ్రీనివాస్‌తో పాటు కుటుంబసభ్యులకు నచ్చజెప్పారు. తిరిగి ఆమెను అత్తగారింటికి పంపించారు. అయినా వారిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో మళ్లీ శ్రీజకు వేధింపులు మొదలయ్యాయి. దీంతో మనస్తాపానికి గురైన శ్రీజ ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తన కూతురు చావుకు భర్త, కుటుంబసభ్యులే కారణమంటూ మృతురాలి తండ్రి రాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


By July 20, 2020 at 09:45AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-woman-end-her-life-for-extra-dowry-harassment-at-shadnagar/articleshow/77059253.cms

No comments