మరో సినీ నటుడిని కాటేసిన కరోనా.. కోవిడ్ -19 కారణంగా సీనియర్ యాక్టర్ మృతి


దేశంలో విలయతాండవం చేస్తోంది. ప్రభుత్వం, ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా దాడికి అడ్డుకట్ట పడటం లేదు. రోజు రోజుకూ అమాంతం కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటం దేశ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. సాధారణ జనంతో పాటు ఇప్పటికే ఈ మహమ్మారి వైరస్ కారణంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా కరోనాతో కన్నడ సీనియర్ నటుడు హల్వానా గంగాధరయ్య(70) కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం హల్వానా గంగాధరయ్యకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో బెంగుళూరులోని బీజీఎస్ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది తలెత్తి శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. 1,500 కు పైగా ప్రదర్శనలు ఇచ్చి స్టేజ్ ఆర్టిస్ట్ నుంచి గొప్ప నటుడిగా పేరు సంపాదించుకున్న ‘కర్నాటక నాటక అకాడమీ అవార్డు’ అందుకున్నారు. ఆ తర్వాత సినీ ఇండీస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 120 సినిమాల్లో నటించారు. నీర్ దోసె, కురిగాలు సర్ కురిగాలు, శబ్దదేవి సినిమాలు ఆయన కెరీర్‌లో చెప్పుకోదగినవి. హల్వానా గంగాధరయ్య మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
By July 20, 2020 at 09:42AM
No comments