Breaking News

ప్రేమ పేరుతో విద్యార్థినికి లైంగిక వేధింపులు.. గుంటూరులో కీచక టీచర్ అరెస్ట్


ప్రేమ, పెళ్లి పేరుతో విద్యార్థిని వెంటపడి వేధిస్తున్న ఉపాధ్యాయుడిని అరండల్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు. స్తంభాలగరువులోని శ్రీకృష్ణదేవరాయనగర్‌కు చెందిన చిలకా శ్రీనివాసరావు బ్రాడీపేటలో ప్రైవేట్ ఇంగ్లీష్‌ కోచింగ్‌ సెంటర్ నిర్వహిస్తున్నాడు. డీఎడ్‌ సెకండియర్ చదువుతున్న ఓ యువతిని ప్రేమ పేరుతో కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఆమె తల్లిదండ్రులను కలిసి మీ కూతురిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి నిశ్చితార్థం పేరుతో రూ.2లక్షలు దోచుకున్నాడు. Also Read: ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అతడు మంచివాడు కాదని వారికి చెప్పాడు. దీంతో వారు శ్రీనివాసరావు గురించి ఆరా తీయగా అతడికి గతంలోనే వివాహమైందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది. దీంతో యువతి తల్లిదండ్రులు నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో కక్షగట్టిన శ్రీనివాసరావు యువతిని మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఎన్నిసార్లు హెచ్చరించినా అతడిలో మార్పు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. Also Read: కొద్దిరోజుల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన శ్రీనివాసరావు మళ్లీ యువతిని వేధించడం మొదలుపెట్టాడు. ఆమెపై సోషల్‌మీడియాలో అసభ్య పోస్టులు పెడుతూ మానసికంగా వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు మరోసారి అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సీఐ శ్రీనివాసరావు ఆదేశాలతో ఎస్ఐ రవీంద్ర నిందితుడిని అరెస్ట్ చేశారు. Also Read:


By July 21, 2020 at 08:58AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/english-teacher-arrested-in-guntur-over-sexual-harassment-on-young-woman/articleshow/77077355.cms

No comments