Breaking News

కరోనా టైమ్‌లో కంత్రీ మోసాలు.. ప్లాస్మా దానం పేరిట 200 మందికి టోకరా


ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. దీనికి వ్యాక్సిన్ కనిపెట్టేందుకు అనేక దేశాల సైంటిస్టులు పగలూ రాత్రి కష్టపడుతున్నారు. మరోవైపు కరోనాను జయించిన వ్యక్తుల నుంచి సేకరిస్తున్న డాక్టర్లు దాని ద్వారా రోగులకు చికిత్స అందిస్తున్నారు. చాలామంది కరోనా విజేతలు స్వచ్ఛందంగా తమ ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకొస్తుంటే.. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు మోసాలకు తెరలేపుతున్నారు. తాజాగా ప్లాస్మా దానానికి సిద్ధమంటూ మోసాలకు పాల్పడుతున్న మోసగాడిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి చేతిలో ఏకంగా 200 మందికి పైగా మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులు షాకయ్యారు. Also Read: శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పోనూగూటివలసకు చెందిన రెడ్డి సందీప్‌(25) 2016లో డిగ్రీ పూర్తి చేశాడు. ఎక్కడా ఉద్యోగం దొరక్క.. ఖర్చులకు డబ్బుల్లేక దొంగగా మారాడు. వైజాగ్ టూ టౌన్, ద్వారకా పీఎస్‌ల పరిధిలో అనేక దొంగతనాలకు పాల్పడి పోలీసులకు చిక్కాడు. జైలు నుంచి బయటికొచ్చేసరికే కరోనా విజృంభిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మాకు భారీ డిమాండ్‌ ఉందని తెలుసుకున్న సందీప్ సరికొత్త మోసాలకు తెరలేపాడు. ప్లాస్మా అవసరమున్న వారి ఫోన్ నంబర్లు, వివరాలు సోషల్‌మీడియా నుంచి సేకరించేవాడు. Also Read: వారికి ఫోన్ చేసి తాను ప్లాస్మా ఇచ్చేందుకు సిద్ధమని, కాకపోతే రవాణా, ఇతర ఖర్చులు మీరే భరించాలని చెప్పేవాడు. గ్రహీతల నుంచి ప్రయాణం, ఇతర ఖర్చుల కింద ముందే ఆన్‌లైన్లో మనీ ట్రాన్స్‌ఫర్ చేయించుకునేవాడు. డబ్బులు అకౌంట్లో పడగానే ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేవాడు. ఇదే తరహాలో కరోనా నియంత్రణ మందుల పేరిట కూడా అనేక మందిని మోసం చేశాడు. అతడి మోసాలపై హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా అనే పోలీస్‌స్టేషన్లలో బాధితులు ఫిర్యాదు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం సందీప్‌ జాడ కనిపెట్టి అదుపులోకి తీసుకున్నారు. అతడిపై బంజారాహిల్స్‌, రాంగోపాల్‌పేట్‌, సీసీఎస్‌, పంజాగుట్టలో కేసులు నమోదైనట్లు గుర్తించారు. నిందితుడిని పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. Also Read:


By July 21, 2020 at 08:42AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-held-for-plasma-fraud-cheated-over-200-persons-in-hyderabad/articleshow/77077127.cms

No comments