Breaking News

సెల్‌ఫోన్ ఎరగా వేసి బాలికను గర్భవతిని చేసి.. ‘అనంత’లో దారుణం


కామాంధుల పీచమనచడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘దిశ’ చట్టం తెచ్చినా వారిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. చట్టాలు తమను ఏమీ చేయలేవన్న ధీమాతో కొందరు మగాళ్లు మృగాళ్లుగా రెచ్చిపోతున్నారు. ఆడది కనిపిస్తే కోరిక తీర్చుకోవడమే లక్ష్యంగా హద్దులు మీరుతున్నారు. రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎంత భయానకంగా ఉందో కొద్దిరోజులుగా జరుగుతున్న వరుస ఘటనలే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మూడు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచార ఘటన మరువక ముందే జిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న బాలికపై కన్నేసిన ఓ కామాంధుడు ఆమెకు సెల్‌ఫోన్ ఆశ చూపించి అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఫలితంగా బాధితురాలు గర్భం దాల్చడంతో అసలు విషయం బయటపడింది. Also Read: మండలంలోని ఓ గ్రామానికి చెందిన శంకర్‌ అనే యువకుడు వ్యవసాయ కూలీ. అతడికి భార్య, 9 నెలల కుమారుడు ఉన్నారు. ఇంటి పక్కనే ఉండే 15ఏళ్ల బాలికపై కన్నేసిన శంకర్ ఆమెను సెల్‌ఫోన్ ఆశ చూపించి మచ్చిక చేసుకున్నాడు. తల్లిదండ్రులు రోజూ వ్యవసాయ పనులకు వెళ్తుండటంతో బాలిక ఒంటరిగా ఉండేది. దీంతో తన సెల్‌ఫోన్లో సినిమాలు, వీడియోలు చూపించే సాకుతో ఆమె శరీర భాగాలను తాకేవాడు. తెలిసీ తెలియని వయసు కావడంతో బాలిక అతడిలోని మృగాడిని గమనించలేకపోయింది. దీన్ని ఆసరాగా తీసుకున్న శంకర్ కొద్దిరోజులకు పోర్న్ వీడియోలు చూపించడం మొదలుపెట్టాడు. అందులో ఉన్నట్లుగా చేస్తే చాలా బాగుంటుందని నమ్మించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడేవాడు. Also Read: బాలిక శరీరంలో ఇటీవల మార్పులు గమనించిన తల్లి ఏం జరిగిందని ఆరా తీయగా శంకర్ నిర్వాకం గురించి చెప్పింది. దీంతో తల్లి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా ఆరు నెలల గర్భంతో ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. బాలిక కుటుంబానికి నగదు, కొంత భూమి ఇస్తామని నచ్చజెప్పి బయటికి పొక్కకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బాధితురాలి తల్లి రెండ్రోజుల క్రితం దీనిపై రాప్తాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు శంకర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ స్పందించారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికతో ఆమె ఫోన్‌లో మాట్లాడారు. నిందితుడికి కఠినశిక్ష పడేలా చేస్తామని, బాధితురాలికి న్యాయం చేస్తామని పద్మ హామీ ఇచ్చారు. Also Read:


By July 21, 2020 at 09:17AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/minor-girl-raped-multiple-times-gets-pregnancy-in-anantapur-district/articleshow/77077669.cms

No comments