కన్నకూతురినే గర్భవతిని చేసిన కీచక తండ్రి.. విశాఖలో ఘోరం
కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి వావి వరుసలు మరిచిపోయి కన్న కూతురిపైనే లైంగిక దాడికి పాల్పడుతున్న నీచపు ఘటన విశాఖ నగరంలో వెలుగుచూసింది. సుమారు ఐదు నెలలుగా ఆ కామాంధుడు సాగిస్తున్న కీచకపర్వంతో బాధితురాలు గర్భం దాల్చింది. బాలిక అస్వస్థతకు గురికావడంతో పరీక్షించిన డాక్టర్లు ఆమె ప్రెగ్నెంట్ అని తెలుసుకుని షాకయ్యారు. దీంతో వెంటనే ఫోర్త్ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. Also Read: విశాఖ రైల్వే న్యూకాలనీలో బాధిత బాలిక, తండ్రి, నాయనమ్మ, తాతయ్య కలిసి ఉంటున్నారు. బాలిక తల్లి ఇటీవలే చనిపోయింది. దీంతో కూతురిపై కన్నేసిన ఆ కామాంధుడు ఆమెకు మాయమాటలు చెప్పి ఐదు నెలలుగా ఇంట్లోనే లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఇటీవల బాలిక తీవ్ర అస్వస్థతకు గురికావడంతో నాయనమ్మ ఆస్పత్రికి తీసుకెళ్లింది. బాలికను పరీక్షించిన డాక్టర్లు ఆమె గర్భం దాల్చినట్లు తెలుసుకుని షాకయ్యారు. Also Read: మైనర్ కావడంతో వెంటనే నాలుగో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాలికను ప్రశ్నించగా తండ్రి అరాచకం గురించి చెప్పింది. దీంతో దిశ పోలీస్‌స్టేషన్ ఏసీపీ ప్రేమ్‌కాజల్ ఆ కీచకుడిపై పోక్సో చట్టం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By July 29, 2020 at 07:53AM
No comments