Breaking News

దేశంలో కోవిడ్ విజృంభణ.. పాజిటివ్ కేసులు, మరణాల్లో బుధవారం కొత్త రికార్డ్


దేశంలో విలయతాండవం కొనసాగుతోంది. బుధవారం పాజిటివ్ కేసులు, మరణాల్లో కొత్త రికార్డులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కోలుకున్న బాధితుల సంఖ్య కూడా పెరగడం సానుకూలంశం. గత రెండు వారాలుగా రోజువారీ పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. జులై నెల తొలి 15 రోజుల్లో దేశంలో పాజిటివ్ కేసులు జూన్ నెలలో నమోదయిన మొత్తంతో సమానంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా బుధవారం 32,498వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 615 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్ పాజిటివ్ కేసుల సంఖ్య 9,68,835కి చేరింది. రికార్డ్ స్థాయిలో మరణాలు సంభవించగా.. జూన్ 16న సవరించిన లెక్కల ప్రకారం దేశంలో ఒక్క రోజే 2,003 నమోదయ్యాయి. ఆ తర్వాత బుధవారం అత్యధికంగా మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 24,860కి చేరింది. ఇప్పటి వరకూ 6,11,973 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జూన్ నెలలో నాలుగు లక్షల కేసులు నమోదు కాగా.. జులై నెల 15 రోజుల్లోనే 3,83,361 కేసులు నమోదయ్యాయి. జూన్‌లో కరోనాతో 12,000 మంది ప్రాణాలు కోల్పోగా.. ఈ 15 రోజుల్లోనే 7,468 మంది చనిపోయారు. బుధవారం కనీసం ఏడు రాష్ట్రాల్లో రోజువారీ పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నిర్ధారణ అయ్యాయి. కర్ణాటక (3,176), ఆంధ్రప్రదేశ్ (2431), కేరళ (623), గుజరాత్ (925), గోవా (198), పశ్చిమ్ బెంగాల్ (1,589), రాజస్థాన్ (866) అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. దేశంలో 3వేల కేసులు నమోదయిన రాష్ట్రాల్లో కర్ణాటక నాలుగో స్థానంలో నిలిచింది. ఇక, 2వేలకుపైగా కేసులు నమోదయిన రాష్ట్రాల జాబితాలో ఏపీ ఐదో స్థానంలో ఉంది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్ తర్వాత 1,000కిపైగా కరోనా మరణాలు చోటుచేసుకున్న రాష్ట్రంగా పశ్చిమ్ బెంగాల్ నిలిచింది. బుధవారం అక్కడ 20 మంది చనిపోయారు. అటు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోనూ మరణాలు రికార్డుస్థాయిలో సంభవించాయి. గడచిన 24 గంటల్లో కర్ణాటకలో 87 మంది, ఏపీలో 44 మంది మరణించారు. తమిళనాడు కరోనా కేసులు 1.5 లక్షలు దాటాయి. ఇప్పటి వరకూ 1,02,310 మంది కోలుకోగా.. 4,496 మంది చనిపోయారు. బుధవారం 2,167 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. మరో 68 మంది చనిపోయారు. ఇక, మహారాష్ట్రలో మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. బుధవారం 7,975 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ కాగా.. 233 మంది చనిపోయారు. అక్కడ జులై నెల తొలి 15 రోజుల్లో లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి. జూన్‌లో ఈ సంఖ్య చేరుకోడానికి 28 రోజుల సమయం పట్టింది. ముంబయిలో మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పడుతుంటే.. మిగతా ప్రాంతాల్లో విజృంభిస్తోంది. కరోనా మరణాలు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఏపీ తర్వాత ఢిల్లీలో (41), యూపీ (29),బెంగాల్ (20), బీహార్ (14), జమ్మూ కశ్మీర్ (12), తెలంగాణ (11), గుజరాత్ (10) చోటుచేసుకున్నాయి.


By July 16, 2020 at 07:14AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-cases-india-hits-highest-1-day-count-of-cases-fatalities/articleshow/76990335.cms

No comments