ఢిల్లీలో రేవ్ పార్టీ భగ్నం.. ఏడుగురు అమ్మాయిలు సహా 31 మంది అరెస్ట్
కరోనా వైరస్ విజృంభనతో దేశం మొత్తం వణికిపోతుంటే కొందరు మాత్రం ఏమీ పట్టనట్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. పార్టీలు, జల్సాల పేరుతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ మహమ్మారిని ఆహ్వానిస్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని పశ్చిమ్ విహార్ ప్రాంతంలో గల ఓ క్లబ్‌లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా ఏడుగురు యువతులు సహా 31 మందిని అరెస్ట్ చేశారు. Also Read: కోవిడ్-19 వ్యాపిస్తున్న తరుణంలో ప్లాగ్ క్లబ్‌కి పెద్దయెత్తున యువతీ యువకులు చేరడంతో అనుమానం వచ్చిన కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అర్ధరాత్రి సమయంలో అక్కడ రైడ్ చేసి పోలీసులు లోపలి పరిస్థితి చూసి షాకయ్యారు. మద్యం మత్తులో యువతీ యువకులు ఒకరి మీద ఒకరు పడటం, యువతులు అర్ధనగ్నంగా డ్యాన్సులు చేస్తుండటాన్ని గమనించి అది రేవ్ పార్టీగా నిర్ధారించారు. దీంతో క్లబ్ యజమాని లావిష్ ఖురానా, ఆయన సోదరుడు కాశిష్ ఖురానా సహా 31 మందిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. Also Read:
By July 16, 2020 at 06:57AM
No comments