Breaking News

ఆంటీలను సుఖపెట్టే ఉద్యోగమంటూ ప్రకటన... టెక్కీకి రూ.83,500 టోకరా


లాక్‌డౌన్ కారణంగా అన్ని రంగాల్లోనే ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. సాఫ్ట్‌వేర్ సంస్థలు కూడా ప్రాజెక్టులు లేక చాలామంది ఉద్యోగులకును తొలగించి చేతులు దులుపుకుంటున్నాయి. ఈ కోవలోనే ఉద్యోగం కోల్పోయిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని ఏకంగా రూ.83,500 కోల్పోయాడు. డబ్బున్న ఆంటీలను సుఖపెట్టాలని, అందుకు గాను రోజూ రూ.వేలల్లో సంపాదించుకోవచ్చని మాయగాళ్లు చెప్పిన మాటలు విని అడ్డంగా బుక్కయ్యాడు. Also Read: బెంగళూరుకు చెందిన ఓ యువకుడు లాక్‌డౌన్ కారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోల్పోయాడు. దీంతో వేరే ఉద్యోగం కోసం వెతికే పనిలో భాగంగా ఆన్‌లైన్‌లో ఓ ప్రకటన చూశాడు. దాని లింక్ క్లిక్ చేసి మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యాడు. కొద్దిరోజుల తర్వాత అతడికి అవతలి నుంచి ఫోన్ వచ్చింది. ధనవంతుల కుటుంబాలకు చెందిన ఆంటీల కోరికలు తీర్చాలని, వారిని సంతృప్తిపరుస్తూ బాగా సంపాదించుకోవచ్చని చెప్పారు. ఆంటీలతో సుఖానికి సుఖం, డబ్బుకు డబ్బు.. రెండు రకాలుగా ఎంజాయ్ చేయొచ్చంటూ ఆ ఉద్యోగానికి ఆసక్తి చూపాడు. Also Read: వారు చెప్పినట్లుగా రూ.1009 చెల్లించి తన పేరు రిజిస్టర్ చేయించుకున్నాడు. మెంబర్‌షిప్ ఫీజు కింద మరో రూ.12,500 చెల్లించాడు. సరసాల ఉద్యోగంలో ప్రవేశించే ముందు సెక్యూరిటీ, ఇతర ఫీజులంటూ సైబర్ కేటుగాళ్లు మరో రూ.70 వేలు గుంజుకున్నారు. వారు మళ్లీ ఫోన్ చేసి ఇతరత్రా ఫీజుల కింద మరికొంత సొమ్ము చెల్లించాలని చెప్పడంతో తన దగ్గర ఇంక డబ్బుల్లేవని, ఉద్యోగంలో చేరాక మిగిలిన సొమ్ము ఇస్తానని చెప్పాడు. అప్పటి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వస్తూనే ఉంది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు చివరకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. Also Read:


By July 15, 2020 at 10:43AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/bengaluru-man-losts-rs-83000-for-cyber-crime-over-male-escort-jobs/articleshow/76972618.cms

No comments