Breaking News

నీ మంచి పనులు కొనసాగించు.. ఉపాసనపై రామ్ చరణ్ ప్రశంసలు


ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భార్యగా, మెగా కోడలిగా, అపోలో ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఆమె కీలక బాధ్యతలు చేపట్టింది. ఎప్పటికప్పుడు సామాజిక అంశాల పట్ల తన వంతు బాధ్యతగా స్పందిస్తూ ఉంటుంది. తాజాగా ఉపాసన తన పుట్టినరోజు వేడుకల్ని జరుపుకుంది. ఈ సందర్భంగా భర్త రామ్ చరణ్ ... ఉపాసనపై ట్వీట్ చేశారు. రామ్ చరణ్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె ఫొటోను పోస్ట్ చేశాడు. 'ఇతరులపై చాలా దయ చూపుతూ నువ్వు చేసే పనులు ఎంత చిన్నవైనా సరే అవి ఎన్నటికీ వృథాకావు. నీ మంచి పనుల్ని ఇలాగే కొనసాగిస్తూ వెళతావని ఆశిస్తున్నాను.. గుర్తింపు దానికదే వస్తుంది. హ్యాపీ బర్త్ డే' అని రామ్ చరణ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఉపాసన సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటుందన్న విషయం తెలిసిందే. ఆమె చేస్తున్న కార్యక్రమాలకు మెగా అభిమానులు ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్లు పెడుతుంటారు. తమ ఆసుపత్రి సిబ్బందితో కలిసి ఉపాసన పలు కార్యక్రమాల్లో పాల్గొంటుంది. చెర్రీకి సంబంధించిన ఫొటోలు, అప్‌డేట్‌లను పోస్ట్ చేస్తూ ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా మెగా అభిమానులకు దగ్గరైంది. అప్పుడప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాల్ని కూడా ఉపాసన నెటిజన్స్ కోసం షేర్ చేస్తూ వస్తోంది. Read More: జులై 20న సందర్భంగా ఆమెకు పలువురు సినీ ప్రముఖులు సైతం శుభాకాంక్షలు తెలిపారు. అయితే మహేష్ కూతురు సితార బర్త్ డే కూడా అదే రోజు కావడంతో ఉపాసన సితార పాపకు విషెస్ చెబుతూ ఓ ట్వీట్ చేశారు.


By July 21, 2020 at 09:10AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-charan-birthday-wishes-to-his-wife-upasana-konidela/articleshow/77077548.cms

No comments