అక్రమ సంబంధంపై వెరైటీ తీర్పు.. పోలీసుల ఎంట్రీతో బుక్కైన గ్రామ పెద్దలు
వ్యవహారంలో వెరైటీగా తీర్పు చెప్పిన 10 మంది పంచాయతీ పెద్దలపై జిల్లా రేగొండ పోలీసులు కేసు నమోదు చేశారు. రేగొండ మండలంలోని రేపాక గ్రామానికి చెందిన హరిబాబుకు జ్యోతి అనే మహిళతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ పాప(3) ఉంది. హరిబాబు అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. హరిబాబు ఆస్తిపై కన్నేసిన ఆ మహిళ ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాలని వేడుకుంది. దీనిపై పంచాయతీ పెట్టిన పెద్దలు ఎకరం భూమి రాసివ్వడంతో పాటు ఆమెతోనే కలిసి ఉండాలంటూ హరిబాబును ఆదేశిస్తూ తీర్పు చెప్పారు. Also Read: అయితే తన భర్త ప్రియురాలితో ఉంటే తన పరిస్థితేంటని నిలదీసిన జ్యోతి పెద్దల తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలంటూ రేగొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు గ్రామ సర్పంచ్ పొనగంటి తిరుపతి, ఉప సర్పంచ్ గుడ్డ తిరుపతి, గ్రామ పెద్దలు పొనగంటి సమ్మయ్య, సుదమల్ల భిక్షపతి, గుర్రం సమ్మయ్య, తుంగండ సమ్మయ్య, పొనంగంటి ఓంకార్, పొనంగంటి జాని, పైడిపల్లి సాంబయ్య, గుర్రం బాబు, పొనంగంటి మల్లయ్యపై కేసు నమోదు చేశారు. గ్రామంలో ఇలాంటి తీర్పులు ఇస్తే కఠినచర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. Also Read:
By June 30, 2020 at 07:47AM
No comments