వైద్యం కోసం వచ్చిన యువతిపై డాక్టర్ అఘాయిత్యం... ఏలూరులో దారుణం
ప్రజలకు వైద్యం అందించాల్సిన వైద్యుడు కీచకుడిగా మారాడు. చికిత్స కోసం తన దగ్గరకు వచ్చిన యువతిపై లైంగిక దాడికి యత్నించి అడ్డంగా బుక్యయ్యాడు. యువతికి ఇంజెక్షన్లు చేసి మైకంలో ఉన్న ఆమె దుస్తులు విప్పి అత్యాచారానికి యత్నించగా ఆమె మేలుకుది. వెంటనే బయటకు పరుగులు తీసి తన తమ్ముడి సాయంతో పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ ఘటన జిల్లా కేంద్రం ఏలూరులో సోమవారం సాయంత్రం జరిగింది. Also Read: వన్‌టౌన్ నాలుగో డివిజన్‌కు చెందిన డాక్టర్ పంతాల సత్యానంద్ స్థానికంగా క్లినిక్ నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతి ఆదివారం అనారోగ్యంగా ఉండటంతో తన తల్లిని తీసుకుని ఆ క్లినిక్‌కు వెళ్లింది. సత్యానంద్ ఆమెకు ఇంజెక్షన్లు చేసి పంపించాడు. సోమవారం సాయంత్రం యువతికి ఫోన్ చేసిన డాక్టర్ మరికొన్ని ఇంజెక్షన్లు చేయాలని చెప్పాడు. తాను బయటకు వెళ్తున్నానని, ఇప్పుడే వచ్చి ఇంజెక్షన్లు చేయించుకోవాలని చెప్పడంతో ఆమె తన తమ్ముడిని వెంటబెట్టుకుని క్లినిక్‌కు వెళ్లింది. Also Read: సత్యానంద్ ఆ యువతిని గదిలోకి తీసుకెళ్లి ఏవో ఇంజెక్షన్లు చేశాడు. దీంతో మైకానికి గురైన ఆమె దుస్తులు తొలగిస్తూ అత్యాచారానికి యత్నించాడు. ఈ క్రమంలోనే తేరుకున్న యువతి అతడిని వెనక్కి నెట్టేసి గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. తమ్ముడితో సహా ఇంటికి చేరుకున్న యువతి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అనంతరం ఏలూరు వన్‌టౌన్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో డాక్టర్ సత్యానంద్‌పై కేసు నమోదు చేశారు. చికిత్స కోసం వచ్చిన యువతిపై లైంగిక దాడికి యత్నించిన కీచక డాక్టర్‌ను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. Also Read:
By June 30, 2020 at 08:08AM
No comments